మరకలు పోవట్లేదా..

ఏదైనా తినేప్పుడు, వంట చేస్తున్నప్పుడు, దుస్తులపై మరకలు పడటం సహజం. వీటిని వదిలించడానికి ఈ ఇంటి చిట్కాలు పాటించి చూడండి.

Published : 03 Sep 2023 01:37 IST

ఏదైనా తినేప్పుడు, వంట చేస్తున్నప్పుడు, దుస్తులపై మరకలు పడటం సహజం. వీటిని వదిలించడానికి ఈ ఇంటి చిట్కాలు పాటించి చూడండి..

  • కాఫీ, టీ, కెచప్‌.. వీటి మరకలు పోగొట్టడానికి కప్పు నీటిలో వెనిగర్‌ కలిపి మరకలున్న చోట స్ప్రే చేయాలి. తర్వాత వాటిని ఉతికితే మరకలు మాయం.
  • ఏదైనా గాయం అయినప్పుడు, లేదా నెలసరి సమయంలో రక్తపు మరకలు పడితే వదిలించడానికి చాలా ప్రయత్నాలు చేస్తాం. మరక ఉన్న చోట రెండు చుక్కలు హైడ్రోజన్‌ పెరాక్సైడ్‌ వేసి ఉతికితే ఫలితం ఉంటుంది.
  • పిల్లల తెల్లచొక్కాల మీద ఇంకు పడినప్పుడు ఏదైనా హెయిర్‌స్ప్రేను మరక ఉన్నచోట చల్లి.. తర్వాత రుద్దితే వదిలిపోతుంది.
  • వర్షాకాలం దుస్తులపై పడ్డ బురద మరకలని పోగొట్టడం కాస్త కష్టమే. బట్టలుతికే నీటిలో కాస్త వెనిగర్‌ వేసి నాననివ్వాలి. తర్వాత ఉతికితే మరకలు పోతాయి.
  • పూజలు, వ్రతాలు మొదలయ్యాయి. ఇలాంటప్పుడు చీరలపై పసుపు మరకలు పడతాయి. మరకలున్నచోట టూత్‌పేస్టుని రాసి రుద్ది ఉతికితే కొత్తగా మెరుస్తాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని