పప్పులకు పురుగు పట్టిందా?
ఈ కాలంలో ఆహార పదార్థాలను నిల్వ చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే వాటికి ఇట్టే పురుగు పట్టేస్తుంది. ముఖ్యంగా వాతావరణంలో తేమ కారణంగా ఈ సమస్య తలెత్తుతుంది.
Published : 10 Sep 2023 01:52 IST
ఈ కాలంలో ఆహార పదార్థాలను నిల్వ చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే వాటికి ఇట్టే పురుగు పట్టేస్తుంది. ముఖ్యంగా వాతావరణంలో తేమ కారణంగా ఈ సమస్య తలెత్తుతుంది. ఈ ఇబ్బందిని అధిగమించాలంటే...
- పప్పులూ, పిండ్లూ, మసాలా పొడులు వంటివాటిని గాలి చొరబడని డబ్బాలో పెట్టాలి. వీటిని అందులో పోసే ముందు లోపల తేమ లేకుండా చూసుకోవాలి. గాజు సీసాలు తేమను లోపలికి చేరనీయవు. వీటి ఎంపిక మేలు.
- వంటగది కిటికీలు, సింకులు, ట్యాప్‌లకు దగ్గరగా పప్పులు, సుగంధ ద్రవ్యాలు ఉంచకూడదు. ఇవి తేమకు గురయ్యే అవకాశం ఎక్కువ. బదులుగా సూర్యరశ్మి పడని, తేమ చేరని పొడి ప్రదేశాల్లో వీటిని నిల్వ చేయాలి.
- ఏదైనా పదార్థాలను నిల్వ చేసే ముందు అడుగున ఓ బ్లాటింగ్ పేపర్‌ని వేయండి. అలానే, వాటిని ఓసారి బాగా ఎండలో ఆరనిచ్చి పెట్టుకుంటే సరి. ఎండ తక్కువగా ఉన్నప్పుడు... నూనె లేకుండా కాస్త వేడి చేసి ఆపై దాచేయండి. వీలైనంతవరకూ వర్షాకాలంలో వస్తువుల్ని నిల్వచేయడం అంత మంచిది కాదు.
- సుగంధద్రవ్యాలు, బియ్యప్పిండి, గోధుమ పిండివి తీసుకోవడానికి ప్రత్యేకంగా ఒక పొడి గరిటె ఉంచుకోవాలి. ఒకవేళ పురుగులు పట్టినా, తేమగా అనిపించినా పై భాగాన్ని తొలగించి మిగిలిన కింది బాగాన్ని కాసేపు ఎండలో ఆరబెట్టి వేరే డబ్బాలో భద్రపరచాలి.
- మసాలాలు, పప్పులు, చక్కెర డబ్బాల్లో అడుగున వస్త్రంలో మూటకట్టిన సిలికా జెల్‌ప్యాకెట్లు వేస్తే తేమను పీల్చుకుని వాటిని పాడవ్వకుండా చూస్తాయి.
Trending
Tags :
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.