వంటిల్లు.. ఆరోగ్యమేనా?
ఇంటిల్లిపాది ఆరోగ్యానికి వంటిల్లే వేదిక. రుచితోపాటు శుచికీ ప్రాధాన్యమిస్తేనే అది సాధ్యం. దాని శుభ్రతపై దృష్టిపెట్టాలిగా మరి? అందుకు సాయపడేవే ఇవి..
ఇంటిల్లిపాది ఆరోగ్యానికి వంటిల్లే వేదిక. రుచితోపాటు శుచికీ ప్రాధాన్యమిస్తేనే అది సాధ్యం. దాని శుభ్రతపై దృష్టిపెట్టాలిగా మరి? అందుకు సాయపడేవే ఇవి..
పాలు కాచేటప్పుడు కొంచెం ఏమరపాటుగా ఉంటే చాలు. పొంగిపోయి.. పొయ్యి, దాని కిందకి చేరిపోతాయి. అప్పటికప్పుడు శుభ్రం చేయలేం. అలాగని వదిలేస్తేనేమో మొండి మరకల్లా తయారవుతాయి. అంతేనా.. స్టవ్ చుట్టూ వ్యర్థాలు చేరిపోయి.. సూక్ష్మజీవులకు ఆవాసంగా మారతాయి. అంటే మనకే అనారోగ్యం. ‘అల్యూమినియం ఫాయిల్ షీట్స్’ అని మార్కెట్‌లో దొరుకుతున్నాయి. చుట్టలా లభ్యమయ్యే వీటిని పొయ్యి డిజైన్‌కు తగ్గట్లు కట్ చేసి స్టవ్ మీద అంటిస్తే చాలు. ఆయిల్, వాటర్ ప్రూఫ్‌గా ఉపయోగపడతాయి. మరకలు పడ్డప్పుడు తడి వస్త్రంతో తుడిస్తే చాలు. మురికీ సులువుగా వదులుతుంది, సమయమూ ఆదా అవుతుంది. వంట పాత్రలుంచే కప్‌బోర్డు, పొయ్యి, సింకుకు వెనకుండే గోడకీ వీటిని అంటించొచ్చు. రంగు మారి, అందవిహీనంగా అనిపించినప్పుడు తొలగిస్తే సరిపోతుంది.
- ఆ జిడ్డు.. వంట చేసేటప్పుడు తాలింపుల మరకలు, కుక్కర్ ఆవిరి వంటివన్నీ పొయ్యి వెనక గోడకు జిడ్డుగా పట్టేస్తాయి. దీనికోసం ఆయిల్, వాటర్ ప్రూఫ్, గ్రీజ్ ప్రూఫ్ వాల్ స్టిక్కర్లు అంటూ మార్కెట్‌లో లభ్యమవుతున్నాయి. వీటికి ఒకవైపు జిగురుంటుంది. పొయ్యి వెనక ఉన్న గోడకు అంటిస్తే సరి. మురికి, జిడ్డు చేరినప్పుడు సునాయసంగా తొలగించి, మరొకదాన్ని అతికిస్తే తిరిగి అద్దంలా మెరిసిపోతుంది. పొయ్యి దిమ్మకు వినియోగించిన మార్బుల్ తదితర ప్రింట్స్‌లోనూ మ్యాచింగ్‌గా ఇవి దొరుకుతున్నాయి. వంటింటికి ప్రత్యేక ఆకర్షణనూ ఇస్తాయి.
- టేప్స్‌తో.. పొయ్యి మీద నుంచి కారినవన్నీ స్టవ్ కిందకే చేరతాయి. తర్వాత మొండి మరకల్లా మారతాయి. శుభ్రతా కష్టమే. వాటర్ ప్రూఫ్ టేప్‌లను తెచ్చుకోండి. రకరకాల వర్ణాల్లో, డిజైన్లలో దొరుకుతున్నాయి. పొయ్యి, దిమ్మెను కలిపేలా అంటిస్తే చాలు. నీళ్లు, మురికి, వ్యర్థాలు కిందకు చేరకుండా అడ్డుకుంటుంది. సింకు చుట్టూ అంటిస్తే నీరు కిందకు లీక్ అవ్వకుండా చూస్తుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.