పూజ వేళ.. ఆకలి వేయకుండా!

పండగలంటే అందరికీ ఆనందమే! మనకు మాత్రం అదనపు పని. పైగా మనలో చాలామంది పూజయ్యేంత వరకూ ముద్ద నోట్లో పెట్టరు. అలాగైతే నీరసం ఆవరించేయదూ? వీటిని తీసుకోండి వ్రతం చెడదు, శక్తీ వస్తుంది.

Updated : 05 Oct 2023 16:14 IST

పండగలంటే అందరికీ ఆనందమే! మనకు మాత్రం అదనపు పని. పైగా మనలో చాలామంది పూజయ్యేంత వరకూ ముద్ద నోట్లో పెట్టరు. అలాగైతే నీరసం ఆవరించేయదూ? వీటిని తీసుకోండి వ్రతం చెడదు, శక్తీ వస్తుంది.

  • బార్లీ.. ఉదయాన్నే గ్లాసు బార్లీ నీటిలో కొద్దిగా నిమ్మరసం, వాము వేసి తాగండి. దీనిలో విటమిన్‌ బి, ఐరన్‌, మెగ్నీషియం, సెలీనియం పుష్కలంగా ఉంటాయి. పీచు కడుపు నిండిన భావన కలిగించి, ఆకలి దరిచేరనీయదు. యాంటీ ఆక్సిడెంట్లు చురుకుగా ఉంచటంలో సాయపడతాయి.
  • జ్యూస్‌.. రెండు క్యారెట్లకు చిన్న బీట్‌రూట్‌ ముక్క, సగం కీరదోస కలిపి మిక్సీ పట్టాలి. రసాన్ని వడకట్టి, దానికి పుదీనా, నిమ్మరసం, తేనె కలిపి తాగితే సరి. వీటిల్లోని న్యూట్రియంట్లు, విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు శరీరానికి శక్తినిస్తాయి. పూజకు ముందు తీసుకోండి. ఆలస్యమైనా అలసట దరిచేరదు.
  • పాలు.. గ్లాసు పాలకు నాలుగు ఖర్జూరం, పావుగంట నానబెట్టిన అంజీర, చెంచా తేనె కలిపి మిక్సీ పట్టి తాగండి. అంజీరలో విటమిన్లు, పొటాషియం, కార్బోహైడ్రేట్లు, మినరల్స్‌ మెండుగా ఉంటాయి. పాలల్లో ఉండే క్యాల్షియం, అంజీరలోని పీచు శరీరానికి కావాల్సిన శక్తిని అందించి, రోజంతా చురుగ్గా ఉంచుతాయి. ఆకలినీ నియంత్రిస్తాయి.
  • అరటి, బొప్పాయి.. పూజకు ముందు రెండింటినీ చిన్న ముక్కలుగా కోసుకొని ఒక కప్పుడు తినండి. జ్యూసు తాగినా మంచిదే. వీటిలో కార్బోహైడ్రేట్లు, గ్లూకోజ్‌, విటమిన్‌ ఎ, బి, సి, పొటాషియం, ప్రొటీన్లు ఎక్కువగా ఉంటాయి. నిస్సత్తువ దరిచేరదు, త్వరగా ఆకలీ వేయదు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్