తెలుపు.. రంగు మారవిక!

ఎంత నచ్చినా తెలుపు రంగు దుస్తులు వేసుకోవాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తాం. ఎక్కడ మరక పడుతుందోనని భయం మరి. లేదా ఉతుకులు పడితే పసుపు వర్ణంలోకి మారతాయేమోనన్న అనుమానం. అయితే ఈ చిట్కాలు ప్రయత్నించండి. ఆ బెంగ ఉండదిక! తెల్లవాటిని విడిగా ఉతకడమే మేలు. ముందు గోరువెచ్చని నీటిలో కాస్త బేకింగ్‌సోడా వేసి...

Published : 03 Oct 2023 01:49 IST

ఎంత నచ్చినా తెలుపు రంగు దుస్తులు వేసుకోవాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తాం. ఎక్కడ మరక పడుతుందోనని భయం మరి. లేదా ఉతుకులు పడితే పసుపు వర్ణంలోకి మారతాయేమోనన్న అనుమానం. అయితే ఈ చిట్కాలు ప్రయత్నించండి. ఆ బెంగ ఉండదిక!

  • తెల్లవాటిని విడిగా ఉతకడమే మేలు. ముందు గోరువెచ్చని నీటిలో కాస్త బేకింగ్‌సోడా వేసి, నానబెట్టి, ఆపై కొద్దిగా రుద్ది ఉతికితే చాలు. మురికీ వదులుతుంది, తెల్లగా మెరుస్తాయి కూడా!
  • మిగతా వాటితో పోలిస్తే వీటిపై మరకలు మరింత ఎక్కువగా కనిపిస్తాయి. మరకలు ఉన్న ప్రాంతాన్ని వెంటనే శుభ్రం చేసుకుంటే మొండి మరకలుగా మారవు. దుస్తులు ఉతికే ముందూ వాషింగ్‌ లిక్విడ్‌ రాసి, తడి చేసుకుంటూ రుద్దితే ఆనవాళ్లు కనపడకుండా మాయమవుతాయి.
  • లిక్విడ్‌ డిష్‌వాష్‌ కూడా తెల్ల దుస్తులను మెరిపిస్తాయని తెలుసా? అర బకెట్‌ నీటికి పావుకప్పు ఈ లిక్విడ్‌ కలిపి, తెల్ల వస్త్రాలను అరగంట నానబెట్టండి. తర్వాత ఉతికేస్తే మెరుస్తాయి.
  • ఉతుకులు పడి పసుపు వర్ణంలోకి మారాయా? అర బకెట్‌ గోరువెచ్చని నీటిలో రెండు చెక్కల నిమ్మరసం పిండి, వాటినీ ఆ నీటిలోనే పడేయండి. గంటసేపు దుస్తులను నానబెట్టి ఉతికితే తిరిగి తెలుపు సంతరించుకుంటాయి.
  • వాషింగ్‌ మెషిన్‌లో ఉతుకుతోంటే ఫ్యాబ్రిక్‌ సాఫ్ట్‌నర్లకు బదులు వైట్‌ వెనిగర్‌ని ఉపయోగించి చూడండి. ఇదీ తెలుపుదనాన్ని రక్షించేదే. ఉతికాక వస్త్రాలను ఎండలోనే ఆరేయండి. తెల్లటి వస్త్రాల నిగారింపు కాపాడటంలో సూర్మరశ్మి సాయపడుతుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని