జుట్టు బాగా ఊడిపోతోంది.. ఎలాంటి ఆహారం తీసుకోవాలి?

నా వయసు 35 సంవత్సరాలు. ఇద్దరు పిల్లలున్నారు. ఈ మధ్య జుట్టు బాగా ఊడిపోతోంది. నిర్జీవంగా మారుతోంది. రాలడం తగ్గించడానికీ, జుట్టు పెరుగుదలకీ ఆహారంలో ఎలాంటి మార్పులు చేసుకోవాలి?

Published : 30 May 2024 15:21 IST

నా వయసు 35 సంవత్సరాలు. ఇద్దరు పిల్లలున్నారు. ఈ మధ్య జుట్టు బాగా ఊడిపోతోంది. నిర్జీవంగా మారుతోంది. రాలడం తగ్గించడానికీ, జుట్టు పెరుగుదలకీ ఆహారంలో ఎలాంటి మార్పులు చేసుకోవాలి?

ఓ సోదరి

జుట్టురాలడానికి అనేక కారణాలున్నాయి. ముందు గమనించుకోవాల్సిన విషయాలు.. తలలో చుండ్రూ, హైపోథైరాయిడ్‌ ఉన్నాయేమో చెక్‌ చేసుకోండి. వీటితోపాటు తీసుకునే ఆహారంలో జుట్టు పెరుగుదలకి అవసరమయ్యే జింక్, ఐరన్, ప్రొటీన్, యాంటీ ఆక్సిడెంట్లు, సెలీనియం వంటివి ఉండేటట్లు చూసుకోవాలి. ఐరన్‌కోసం ఆకుకూరలు.. తోటకూర, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, మునగాకు వంటివి పొడుల రూపంలో తీసుకోవాలి. జింక్‌.. నట్స్, బీన్స్, చికెన్, మటన్, గుడ్డు ద్వారా లభిస్తుంది. ప్రొటీన్‌.. పప్పుదినుసులు, బఠాణీలు, బొబ్బర్లు, సెనగలు, రాజ్మా వంటి వాటి నుంచి  లభిస్తుంది. ఇంకా తక్కువ కొవ్వులుండే పాలు, పెరుగు, పనీర్‌ ద్వారా కూడా ప్రొటీన్‌ లభిస్తుంది. అయితే దీని మోతాదు మాత్రం మీ బరువుపై ఆధారపడి ఉంటుంది. వీటితోపాటు ఆరోగ్యకర కొవ్వుల కోసం ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్లు ఉండే వాల్‌నట్స్, బాదం, చియా, అవిసెగింజలు, గుమ్మడి గింజలు, చేప వంటివి తినాలి. అలాగే విటమిన్‌-ఎ, సి ఎక్కువగా ఉండే తాజా పండ్లు తీసుకోవాలి. మొలకలు, వెజిటబుల్‌ సలాడ్స్‌ని చిరుతిండిగా తీసుకుంటే మంచిది. ఈ పోషకాలన్నీ మీ శరీరానికి అందేలా చేస్తే కచ్చితంగా మీ జుట్టుఆరోగ్యంగానూ, ఒత్తుగానూ పెరుగుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్