భార్యలతోనూ నెలసరి గురించి మాట్లాడరట!

నెలసరి ప్రతి ఆడపిల్ల జీవితంలోనూ సాధారణమనీ, అదే ప్రత్యుత్పత్తి వ్యవస్థకు మూలం అని తెలిసినా దాని గురించి మాట్లాడడానికి చాలామంది ఇష్టపడరు. గత కొన్నేళ్లుగా ఈ పరిస్థితిలో మార్పు వచ్చిందని భావిస్తున్నా అది నిజం కాదంటోంది ఓ సర్వే.

Published : 31 May 2024 14:18 IST

నెలసరి ప్రతి ఆడపిల్ల జీవితంలోనూ సాధారణమనీ, అదే ప్రత్యుత్పత్తి వ్యవస్థకు మూలం అని తెలిసినా దాని గురించి మాట్లాడడానికి చాలామంది ఇష్టపడరు. గత కొన్నేళ్లుగా ఈ పరిస్థితిలో మార్పు వచ్చిందని భావిస్తున్నా అది నిజం కాదంటోంది ఓ సర్వే. ప్రపంచ నెలసరి శుభ్రతా దినోత్సవం సందర్భంగా ‘బ్రాండ్‌ ఎవర్టీన్‌’ చేసిన అధ్యయనం ఆశ్చర్యకరమైన విషయాలను వెల్లడించింది. పట్టణ ప్రాంతంలో నివసిస్తూ, డిగ్రీ, ఆపై ఉన్నత చదువులు చదివినవారిలో యాభైశాతం మందికిపైగా మగవారు ఇప్పటివరకూ తమ భాగస్వామికోసం శానిటరీ ఉత్పత్తులేవీ కొనలేదట. కనీసం ఆమె పని భారాన్ని తగ్గించడానికి సాయం చేయని వారి శాతం 88.3గా ఉందట. సామాజిక అపోహల వల్ల 69.8 శాతం మంది పురుషులు తమ భార్యలతో పీరియడ్స్‌ గురించి చర్చించడాన్ని కష్టంగా భావిస్తున్నారట. అయితే, 65.3 శాతం మంది మాత్రం ఇకనుంచి రుతుక్రమ పరిస్థితులు గురించి తెలుసుకుంటామని, మరికొంత మందికీ అవగాహన కల్పిస్తామని వాగ్దానం చేశారట. కేవలం 27.7 శాతం మంది మాత్రమే తమ భాగస్వామి అవసరాలను వింటామనీ, ఆ సమయంలో వారికి పనిలో సాయపడతామనీ చెప్పారు. ఇక స్త్రీల విషయానికి వస్తే...  ప్రతి నలుగురిలో ముగ్గురు మహిళలు... తమ భర్తలతో పీరియడ్స్‌ గురించి చర్చించడానికి ఏ మాత్రం ఆసక్తి చూపించడం లేదట. ఈ అధ్యయనంలో భాగంగా సుమారు 7,800 మందితో మాట్లాడగా వీరంతా 18-35 ఏళ్లలోపు వారే. ఈ వివరాలు నెలసరిపై అవగాహన పెంచాల్సిన అవసరాన్ని మరోసారి నొక్కి చెబుతున్నాయి! 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్