చేపల మధ్య సేదతీరేలా..!

అక్వేరియం... ఇంట్లో ఓ మూలన ఉండే అలంకారం మాత్రమే కాదు. ఇప్పుడు ఇంటీరియర్‌ డిజైనింగ్‌లోనూ, ఆధునిక ఫర్నిచర్‌ల్లోనూ భాగంగా మారింది. హాల్లో డిజైనర్‌ వాల్‌గానో, టీపాయ్‌ గానో, బెడ్‌కి ఉండే హెడ్‌బోర్డులోనో ఒదిగిపోయి అందరి మనసుల్నీ దోచుకుంటోంది. రంగురంగుల బుల్లి బుల్లి చేపలు గిరగిరా తిరుగుతూ ఉంటే చిన్నపిల్లలే కాదు, పెద్దలు సైతం కళ్లు విప్పార్చుకుని కాసేపు వాటిని చూస్తూ ఉండిపోతారు.

Published : 03 Jun 2024 00:47 IST

స్వీట్‌ హోమ్‌

క్వేరియం... ఇంట్లో ఓ మూలన ఉండే అలంకారం మాత్రమే కాదు. ఇప్పుడు ఇంటీరియర్‌ డిజైనింగ్‌లోనూ, ఆధునిక ఫర్నిచర్‌ల్లోనూ భాగంగా మారింది. హాల్లో డిజైనర్‌ వాల్‌గానో, టీపాయ్‌ గానో, బెడ్‌కి ఉండే హెడ్‌బోర్డులోనో ఒదిగిపోయి అందరి మనసుల్నీ దోచుకుంటోంది. రంగురంగుల బుల్లి బుల్లి చేపలు గిరగిరా తిరుగుతూ ఉంటే చిన్నపిల్లలే కాదు, పెద్దలు సైతం కళ్లు విప్పార్చుకుని కాసేపు వాటిని చూస్తూ ఉండిపోతారు. అందుకే నీటిని మార్చుకుంటూ శుభ్రం చేయడం కష్టమైనా ఇష్టంగా అక్వేరియాన్ని ఇంట్లో పెట్టుకుంటారు. అయితే ఇంటీరియర్‌ డిజైన్‌లో రోజుకో రకం పుట్టుకొస్తున్న కాలం ఇది. అందుకే వీటికీ ఆధునిక లుక్‌ని అద్ది ఒక మూల కాకుండా ఇంటి అందాన్నీ పెంచేలానూ, స్పేస్‌ సేవింగ్‌లో భాగంగానూ తయారు చేస్తున్నారు తయారీదారులు. ఇంటిలోకి రాగానే హాలులోనో, బెడ్‌రూమ్‌లోనో కూర్చుని కాసేపు సేదతీరుతుంటాం కదా. అందుకే కూర్చునే సోఫానీ, పడుకునే బెడ్‌నీ అక్వేరియంగా మార్చేశారు డిజైనర్లు. వీటికోసం కొంతమంది గాజుని ఉపయోగిస్తే.. మరికొందరు అక్రిలిక్, చెక్క వంటి మెటీరియళ్లని వినియోగిస్తున్నారు. వీటిల్లో ఫిల్టరేషన్‌ సిస్టమ్, హీటర్, లైటింగ్‌ స్విచ్‌లూ.. పైకి కనిపించకుండా పక్కకి అమరుస్తున్నారు. దాంతో అవి కనిపించి, అందం చెదురుతుందన్న బెంగా ఉండదు. అందరినీ ఆకర్షిస్తున్న ఈ అక్వేరియం అందాల్ని మీ ఇంటికీ ప్రయత్నిస్తారా మరి?

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్