నా భర్త వ్యక్తిగత విషయాలు కూడా చెప్పేస్తున్నాడు..!

మాకు పెళ్లయ్యి మూడేళ్లవుతోంది. ఇద్దరం ఉద్యోగాలు చేస్తున్నాం. నా భర్త ఇంట్లో బాగానే ఉంటారు. కానీ, తన స్నేహితులతోనూ, కుటుంబ సభ్యులతోనూ మా వ్యక్తిగత విషయాలూ పంచుకుంటున్నారు. ఇది తప్పని ఎన్నిసార్లు చెప్పినా ఆ పద్ధతి మార్చుకోవడం లేదు. వాళ్లు ఎదురుపడినప్పుడు నాకేమో చాలా అసౌకర్యంగా అనిపిస్తుంది.

Updated : 03 Jun 2024 19:40 IST

మాకు పెళ్లయ్యి మూడేళ్లవుతోంది. ఇద్దరం ఉద్యోగాలు చేస్తున్నాం. నా భర్త ఇంట్లో బాగానే ఉంటారు. కానీ, తన స్నేహితులతోనూ, కుటుంబ సభ్యులతోనూ మా వ్యక్తిగత విషయాలూ పంచుకుంటున్నారు. ఇది తప్పని ఎన్నిసార్లు చెప్పినా ఆ పద్ధతి మార్చుకోవడం లేదు. వాళ్లు ఎదురుపడినప్పుడు నాకేమో చాలా అసౌకర్యంగా అనిపిస్తుంది. వాళ్లతో ఇదివరకులా స్వేచ్ఛగా కూడా ఉండలేకపోతున్నా. నేను ఏం చేయాలి?

ఓ సోదరి

మీ భర్త ఇంటి విషయాలు, మీ వ్యక్తిగత విషయాలు ఆప్తులకు మాత్రమే చెబుతున్నారా? లేదా అందరికీ చెబుతున్నారా అనేది తెలియడం లేదు. ఏది ఏమైనా అన్ని విషయాలూ అందరితో పంచుకోలేం. ఏ విషయం ఎవరికి ఎంతవరకూ చెప్పాలనేది వారివారి పరిణతిని బట్టి ఉంటుంది. ఒకవేళ మీ భర్త మీ ఆంతరంగిక విషయాలూ ఇతరులతో చెబుతున్నట్లయితే, అతనికి అంత పరిణతి లేదని అనుకోవచ్చు. అతని వ్యక్తిత్వం, పెరిగిన వాతావరణం కూడా అందుకు కారణమై ఉండొచ్చు. అతను ఆత్మీయులతో తన కష్టసుఖాల వరకూ చెప్పుకొంటే తప్పులేదు. కానీ పరిధి దాటితే సమస్యే. మీరు ఎన్నిసార్లు చెప్పినా అర్థం చేసుకోవడం లేదంటే ఏదో సమస్య ఉండి ఉంటుంది. అందుకే, ఒకసారి ఫ్యామిలీ కౌన్సెలర్‌ దగ్గరికి తీసుకెళ్లండి. వాళ్లు తనతోపాటు మీ మానసిక స్థితి, వ్యక్తిత్వాలనూ పరీక్షిస్తారు. అతనికి కుటుంబ వ్యవహారాలు, సమస్యలు ఎవరితో ఎంతవరకూ చర్చించుకోవాలన్నది సూచిస్తారు. మీకూ అతని ఆలోచనా విధానం అర్థమవుతుంది. అతని ప్రవర్తనలోనూ మార్పు వచ్చే అవకాశం ఉంటుంది. 

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్