ఇలాగైతే పాస్‌ అవుతానా..?

పేరుకే సెలవులు. ప్రాజెక్టులు, హోమ్‌ వర్క్‌ అంటూ రోజూ ఎంత పనో. ఆడుకోవడం, స్నేహితులతో మాట్లాడటానికీ సమయం లేదంటే అర్థం చేసుకోండి. ఎంత చేసినా పూర్తవ్వలేదు... అదో ఒత్తిడి. దీంతో కొన్ని విషయాలనూ మర్చిపోతున్నా.

Published : 14 Jun 2024 14:19 IST

పేరుకే సెలవులు. ప్రాజెక్టులు, హోమ్‌ వర్క్‌ అంటూ రోజూ ఎంత పనో. ఆడుకోవడం, స్నేహితులతో మాట్లాడటానికీ సమయం లేదంటే అర్థం చేసుకోండి. ఎంత చేసినా పూర్తవ్వలేదు... అదో ఒత్తిడి. దీంతో కొన్ని విషయాలనూ మర్చిపోతున్నా. అసలే ఇప్పుడు పదో తరగతి. ఇలా మర్చిపోతూ వెళితే పాస్‌ అవుతానా అన్న భయం పట్టుకుంది. ఏం చేయాలి?

ఓ సోదరి

పిల్లలకు చదువు భారం తగ్గాలి, కొంచెం ఆటవిడుపు ఉండాలని సెలవులు ఇస్తారు. కానీ చాలా స్కూళ్లు అత్యుత్సాహంతో ఆ సమయంలోనూ పని భారం మోపుతున్నాయి. అల్లరి భరించలేమని తల్లిదండ్రులూ ప్రోత్సహిస్తారు. కొన్ని యాక్టివిటీస్‌ ఇచ్చి, మిగతా సమయం ఆడుకునేలా చూస్తే వాళ్లూ ఆనందంగా చేస్తారు. భారమైతేనే నీలా ఒత్తిడికి గురవుతారు. నువ్వు పూర్తి చేయలేకపోతున్నా అన్న భయంతో మిగతావాటిపై దృష్టిపెట్టలేదు. అందుకే అనవసరంగా ఆందోళనకు గురవుతున్నావు. అసలే స్కూళ్లు ప్రారంభమయ్యాయి. ఇలాగే కొనసాగిస్తూ వెళితే మరింత ఇబ్బంది పడతావు. కాబట్టి, స్కూలు నుంచి రాగానే మళ్లీ పుస్తకాలతోనే కుస్తీ వద్దు. బదులుగా కొంత సమయం నీకు నచ్చిన పనులు... ఆడుకోవడం, పాటలు వినడం, ఆర్ట్‌ వంటివాటికి కేటాయించు. కొత్త విషయాలు నేర్చుకోవడం, స్నేహితులు, కుటుంబ సభ్యులతో గడపడం చెయ్యి. ఆ తరవాత హోమ్‌వర్క్‌పై దృష్టిపెట్టు. మనసూ తేలికపడుతుంది. ఆ ఉత్సాహంతో పనులూ వేగంగా చేస్తావు. కష్టం, నచ్చట్లేదు అనిపిస్తే ఏ పనైనా భారంగా, బాధగానే తోస్తుంది. తెలియని ఒత్తిడి చేరి మర్చిపోతుంటాం కూడా. అయినా పదోతరగతి ముఖ్యమైన దశే. కానీ క్లిష్టమైనదైతే కాదు. చక్కగా నచ్చింది చేస్తూ... ఓ ప్రణాళికతో చదువు. తప్పకుండా మంచి గ్రేడ్‌ సాధిస్తావు. ఆల్‌ ద బెస్ట్‌!!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్