చెంచాతో తూకం వేయొచ్చు ...!

వంటింట్లో రోజూ ఒకే రకమైన వంటలు కాకుండా కొత్తగా ఏదైనా ప్రయోగం చేయడంలో ప్రతి ఒక్కరికీ ఆసక్తి ఉంటుంది. అయితే ఆ వంటకు కావాల్సిన పదార్థాలను సరైన పరిమాణంలో వేస్తేనే ఘుమఘుమలాడే రుచిని తెప్పించొచ్చు. దీని కోసమే రకరకాల మినీ కిచెన్‌ స్కేల్స్‌ వస్తున్నాయి. అవేంటో చూద్దాం.

Updated : 18 Jun 2024 13:24 IST

వంటింట్లో రోజూ ఒకే రకమైన వంటలు కాకుండా కొత్తగా ఏదైనా ప్రయోగం చేయడంలో ప్రతి ఒక్కరికీ ఆసక్తి ఉంటుంది. అయితే ఆ వంటకు కావాల్సిన పదార్థాలను సరైన పరిమాణంలో వేస్తేనే ఘుమఘుమలాడే రుచిని తెప్పించొచ్చు. దీని కోసమే రకరకాల మినీ కిచెన్‌ స్కేల్స్‌ వస్తున్నాయి. అవేంటో చూద్దాం.


స్మార్ట్‌ కిచెన్‌

డిజిటల్‌గా...

వంటింటి పదార్థాలను ఈ చెంచాల్లో వేస్తే చాలు. అవెంత బరువో... చెంచా కాడకు ముందుభాగాన ఉన్న చిన్న స్క్రీన్‌పై కనిపిస్తుంది. అలా ఈ డిజిటల్‌ స్పూన్‌లో పప్పుదినుసులు, ఉప్పు, కారం, మసాలాలు వంటి పదార్థాల పరిమాణాన్ని చెక్‌ చేసుకుని మరీ కావాల్సినంత మేరకు ఉపయోగించుకోవచ్చు. పదార్థాలన్నీ ఎక్కువ, తక్కువ లేకుండా సమానంగా ఉండి వంట రుచిని పెంచుతాయి. ఈ చెంచాకు ఆన్, ఆఫ్‌ బటన్‌ సౌకర్యం కూడా ఉంది. అన్ని రంగుల్లోనూ ఆకర్షణీయంగా లభ్యమవుతున్నాయి.


స్క్రీన్‌పై చూస్తూ...

దుకాణాల్లో కనిపించే పెద్దపెద్ద వెయింగ్‌ మిషన్‌లాంటిదే కానీ చిన్న పరిమాణంలో ఉంటుంది. దీనిపై గిన్నె ఉంచి, అందులో మనకు కావాల్సిన పిండి, నూనె వంటి వంట పదార్థాలను విడివిడిగా వేసి బరువెంత ఉన్నాయో తెలుసుకోవచ్చు. దీనికున్న స్క్రీన్‌పై చూస్తూ, కావాల్సినంత పరిమాణంలో పదార్థాలను తూచి మరీ వినియోగించొచ్చు. సరైన పరిమాణంలో వేయడంవల్ల వంటకు రుచీ వస్తుంది. అదీగాక, ఆరోగ్యానికి పెద్దపీట వేస్తున్న కాలమిది. మనం తీసుకొంటున్న పోషకాహారంలో తగినన్ని కాయగూరలు ఇతరత్రా ఆహార పదార్థాలు తీసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది.


పోర్టబుల్‌గా...

ఈ కిచెన్‌ స్కేల్‌ చిన్న కాఫీ కప్పు ఆకారంలో, హ్యాండిల్‌పై డిజిటల్‌ స్క్రీన్‌ అటాచ్డ్‌గా ఉంటుంది. దీన్ని ఆన్‌ చేసి వంట లేదా సలాడ్స్‌కు కావాల్సిన పదార్థాలను ఇందులో వేస్తే బరువెంత ఉందో సూచిస్తుంది. దీంతో ఎక్కువ, తక్కువ కాకుండా, వృథాకు చోటు లేకుండా సరైన పరిమాణంలో తీసుకోవచ్చు. వంటకు నిమిషాల్లో కావాల్సినవన్నీ కూడా సిద్ధం చేసుకోవచ్చు. అంతేనా...తక్కువ బరువుతో ఎక్కువ స్థలం ఆక్రమించకుండా ఉన్న ఈ పోర్టబుల్‌ స్కేల్స్‌ డైనింగ్‌ టేబుల్, గ్యాస్‌ స్టవ్‌ దిమ్మ, వంటింటి గోడ అంటూ... ఎక్కడైనా సర్దేయగలిగేలా భలేగున్నాయి కదూ..!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్