లేచిపోయానని ప్రచారం చేస్తున్నారు.. ఆపేదెలా?

పెళ్లప్పుడు కట్నకానుకలు వద్దు... పిల్లని ఇస్తే చాలని చేసుకున్నారు. అత్తింట్లో అడుగుపెట్టిన రోజు నుంచే నా నడక, మాట, చేత... ఇలా ప్రతిదాన్నీ నలుగురిలో హేళన చేసేవారు. ఎదురుతిరిగితే... ‘కట్నం తీసుకోనిది ఇంట్లో పడి ఉంటావనీ, ప్రశ్నిస్తే నీకు బతుకే ఉండద’నీ హెచ్చరిస్తున్నారు.

Published : 18 Jun 2024 19:23 IST

పెళ్లప్పుడు కట్నకానుకలు వద్దు... పిల్లని ఇస్తే చాలని చేసుకున్నారు. అత్తింట్లో అడుగుపెట్టిన రోజు నుంచే నా నడక, మాట, చేత... ఇలా ప్రతిదాన్నీ నలుగురిలో హేళన చేసేవారు. ఎదురుతిరిగితే... ‘కట్నం తీసుకోనిది ఇంట్లో పడి ఉంటావనీ, ప్రశ్నిస్తే నీకు బతుకే ఉండద’నీ హెచ్చరిస్తున్నారు. ఈ బాధలు తట్టుకోలేక పారిపోయి హాస్టల్‌లో తలదాచుకుంటున్నా. దాంతో నేను ఎవరితోనో లేచిపోయానని ప్రచారం చేస్తున్నారు. ఈ ఇబ్బందుల నుంచి బయటపడేందుకు చట్టం నాకెలా సాయం చేస్తుంది?

ఓ సోదరి

మీలాంటి వారికోసమే గృహహింస చట్టం-2005 తెచ్చారు. ఇందులోని సెక్షన్‌ 3 ప్రకారం అత్తింట్లో నాలుగ్గోడల మధ్య భర్త, అత్తమామలు, ఒకే ఇంట్లో కలిసి జీవిస్తోన్న తల్లిదండ్రులు, అన్నదమ్ములు... ఎవరైనా సరే, మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా హింసిస్తుంటే దాన్ని గృహహింస కిందే పరిగణిస్తారు. అలానే, ఏ విషయం మీదైనా బలవంతం చేసినా, బెదిరించినా కూడా చట్టప్రకారం శిక్షార్హులు. మీరు అనుభవిస్తోన్న వేదన అంతా మానసిక హింసే. పై సెక్షన్‌లోని సబ్‌ క్లాజ్‌(2) వెర్బల్‌ లేదా ఎమోషనల్‌ అబ్యూజ్‌ గురించి వివరిస్తుంది. అంటే అవమానించడం, హేళన చేయడం, అందం, డబ్బు లేవని తక్కువ చేసి చూడటం, క్యారెక్టర్‌ మీద అభాండాలు వేయడం లాంటివన్నీ ఇందులో చేర్చారు. ముందు భయపడకుండా మీ దగ్గర్లోని ప్రొటెక్షన్‌ ఆఫీసర్‌ దగ్గరకు వెళ్లి ఫిర్యాదు చేయండి. దాని ఆధారంగా ఆయన అవతలివారిని పిలిపించి విచారిస్తారు. అవసరమైన కౌన్సెలింగ్‌ చేస్తారు. ఒకవేళ వినకపోతే ఇందులోని సెక్షన్‌ 12 కింద కేసును కోర్టుకి పంపిస్తారు. అక్కడ సెక్షన్‌-18 ప్రకారం రక్షణ, సెక్షన్‌-19 ప్రకారం ఇంట్లో నివసించే హక్కు, సెక్షన్‌- 22 కింద నష్టపరిహారం పొందవచ్చు. ముందుగా పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయండి. అప్పటికీ మీరు విడాకులు కావాలని కోరుకుంటే హిందూ వివాహచట్టంలోని సెక్షన్‌ 13(1)కింద దరఖాస్తు చేసుకోవచ్చు. వద్దనుకుంటే ఫ్యామిలీ కౌన్సెలింగ్‌ ద్వారా మార్చుకోవడానికి ప్రయత్నించండి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్