కోడిజుట్టు... రంగుల కనికట్టు

రంగు రంగుల పూలు ఇంటి ముందు స్వాగతం పలుకుతుంటే ఎంత బాగుంటుందో కదా! అయితే, ఈ కోడిజుట్టు లేదా సీతమ్మవారి జడగంటలుగా పిలిచే  ఈ పూల మొక్కల్ని మీ ముంగిట్లో నాటేయండి.

Published : 20 Jun 2024 01:10 IST

రంగు రంగుల పూలు ఇంటి ముందు స్వాగతం పలుకుతుంటే ఎంత బాగుంటుందో కదా! అయితే, ఈ కోడిజుట్టు లేదా సీతమ్మవారి జడగంటలుగా పిలిచే  ఈ పూల మొక్కల్ని మీ ముంగిట్లో నాటేయండి.

రుపు, కాషాయం, ఊదా, గులాబీ, పసుపు, తెలుపు, వెండి రంగుల్లో... మిగిలిన పూల ఆకృతికి భిన్నంగా పూసే ఈ పూలు చూడ్డానికి భలే ఉంటాయి. అమరాంతేసీ కుటుంబానికి చెందిన సెలోసియా మొక్కల పూలు ప్రధానంగా మూడు విభిన్న ఆకృతుల్లో వికసిస్తాయి. ఇందులోనూ అర్జెంటీయా, సెలోసియా స్పికాటా రకాలు ఉన్నాయి. వీటికి ఉప జాతులుగా క్రిస్టాటా, ఫ్లూమోసా, వీట్‌ ఉన్నాయి. ఈ పూలలో కొన్ని కోడి తలలా కనిపిస్తే మరికొన్ని ఈకలతో కప్పిన మంటలా ఉంటాయి. కోడిజుట్టు పూలను అలంకరణ కోసం తాజాగానే కాకుండా  కొన్నిదేశాల్లో ఎండినవీ వాడుతుంటారు. ఇందులో ఓ రకమైన గునుగుపూలను మన దగ్గర బతుకమ్మను పేర్చడానికి వినియోగిస్తారు.

సంరక్షణ ఇలా...

ఈ మొక్కను కొన్ని ప్రాంతాల్లో కాక్స్‌ కాంబ్‌ అంటే, మరికొన్నిచోట్ల ఊల్‌ ఫ్లవర్స్‌ అనీ పిలుస్తారు.  చైనా సంప్రదాయ వైద్యంలో ఈ మొక్క భాగాల్ని వాడతారు. ఇది సుమారు 6-18 అంగుళాల వరకూ పెరుగుతుంది. ఇందులో డ్వార్ఫ్‌ వెరైటీలూ ఉన్నాయి. ఇది చక్కగా ఎదగాలంటే పూర్తిగా ఎండ తగలడం అవసరం. నీరు ఎక్కువగా ఉన్న చోటే కాదు... పొడినేలల్లోనూ పెరుగుతుంది. కోడిజుట్టు పూలు సీతాకోక చిలుకల్ని బాగా ఆకర్షిస్తాయి. మరింత ఎక్కువగా విరబూయాలంటే మట్టిలో నత్రజని, భాస్వరం, పొటాషియం...సమాన భాగాలుగా చేసి కలపాలి. ఈ మొక్కకి చీడపీడల సమస్య తక్కువే అయినా నీళ్లు ఎక్కువ అయితే మాత్రం ఆకుమచ్చలు, లేడీ బగ్‌లు ఇబ్బందిపెడతాయి. దీనికి పరిష్కారంగా సబ్బునీళ్లు, వేపనూనె వంటివి చల్లితే చాలు సమస్య దూరమవుతుంది. 

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్