ఆసనాలకో... కుర్చీ!

లావు తగ్గాలన్నా... శరీరం, మనసు దృఢంగా, ఉత్సాహంగా ఉండాలన్నా... అందరి ముందూ కనిపిస్తోన్న సాధనం ‘యోగా’నే! ఇది చేయడం అంత సులువా ఏంటి? మనసు, శరీరం మధ్య సరైన సమన్వయం తప్పనిసరి.

Published : 22 Jun 2024 01:44 IST

లావు తగ్గాలన్నా... శరీరం, మనసు దృఢంగా, ఉత్సాహంగా ఉండాలన్నా... అందరి ముందూ కనిపిస్తోన్న సాధనం ‘యోగా’నే! ఇది చేయడం అంత సులువా ఏంటి? మనసు, శరీరం మధ్య సరైన సమన్వయం తప్పనిసరి. అప్పుడే కోరుకున్న ప్రయోజనాలను పొందగలం. కానీ... కూర్చుని వేసే ఆసనాలైతే పర్లేదు. నిల్చొని, వంగి చేసేవాటితోనే సమస్య. కొత్తల్లో పడిపోతామని భయం. ఆర్థరైటిస్, కీళ్ల నొప్పులుంటే యోగా సరిపడదనే నిర్ణయానికీ వచ్చేస్తారు. ఇక ధ్యానం చేద్దామని కూర్చుంటే కొందరికి కాళ్లు సహకరించవు. కొన్నిసార్లు వెన్ను నిటారుగా ఉంచితే నొప్పి. పదే పదే మనసు వీటన్నింటిపైకీ మళ్లుతోంటే మనం మాత్రం ప్రశాంతంగా ఎలా చేస్తాం? ఆసనాల ప్రయోజనాలను ఎలా పొందుతాం? వీటన్నింటికీ పరిష్కారంగా వచ్చిందే ‘యోగా ఫర్నిచర్‌’. ఆసనాలు, మెడిటేషన్‌ చేయడానికి వీలుగా స్టూళ్లు, సోఫాలు, కుర్చీలు, లాంజ్, దిండ్ల రూపంలో దొరుకుతున్నాయి. భంగిమ సరిగా ఉండేలా సాయపడుతూనే శరీరానికి విశ్రాంతినీ ఇస్తాయి. ఎలాంటి భయాలూ, ఇబ్బందులూ లేకుండా ప్రశాంతంగా యోగా చేసుకునేలా చూస్తాయి. మీరూ యోగా చేస్తున్నారా? మీకూ ఇలాంటి భయాలున్నాయా? అయితే వీటి సాయంతో.. కష్టమనుకున్న ఆసనాల్నీ సులువుగా చేసేయండి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్