ఆహారానికీ ఓ గొడుగు..!

వంటగదిలోని వస్తువులు ఉపయోగకరంగా ఉండడంతోపాటు ఆకర్షణీయంగానూ ఉంటే... బాగుంటుంది కదా? అలాంటి వస్తువుల్లో కొన్నే ఇవి.. మీరూ చూసేయండి! చిన్నప్పుడు పసిపిల్లల కోసం దోమతెర వాడేవాళ్లు గుర్తుందా? ఇప్పుడు అలాంటిదే ‘ఫుడ్‌ కవర్’ గా వాడుతున్నారు.

Published : 26 Jun 2024 00:59 IST

వంటగదిలోని వస్తువులు ఉపయోగకరంగా ఉండడంతోపాటు ఆకర్షణీయంగానూ ఉంటే... బాగుంటుంది కదా? అలాంటి వస్తువుల్లో కొన్నే ఇవి.. మీరూ చూసేయండి!

ఈగలు వాలకుండా...

చిన్నప్పుడు పసిపిల్లల కోసం దోమతెర వాడేవాళ్లు గుర్తుందా? ఇప్పుడు అలాంటిదే ‘ఫుడ్‌ కవర్’ గా వాడుతున్నారు. భోజనం టీ, స్నాక్స్‌ లాంటివి ఏవైనా పూర్తవ్వగానే తినేస్తే సరి. లేకుంటే వెంటనే ఈగల్లాంటివి వాటిపై ముసురుతుంటాయి. చూడ్డానికి చికాకుగా ఉండడంతోపాటు ఆ ఆహారాన్ని తింటే అనారోగ్యమే కదా! అదేకాదు, ఒక్కోసారి ఇంట్లో అందరూ కలిసి తినడం కుదరకపోవచ్చు.

అలాంటప్పుడు ఆహారంపై మూతలు ఉంచినా కూడా దుమ్మూ, ధూళీ లాంటివి పడొచ్చు. ఈ ఇబ్బంది లేకుండా ఉపయోగపడేవే ఈ ఫుడ్‌ కవర్లు. దీని వాడకం కూడా చాలా తేలిక. గొడుగును ఎలా వాడతామో దీన్ని కూడా అంతే. డైనింగ్‌ టేబుల్‌ మీద, ఫ్లోర్‌ మీద ఎక్కడైనా దీన్ని పెట్టొచ్చు. ఒకవేళ మాసిపోయినా కూడా శుభ్రపరచడం ఈజీనే. పైగా మడిచే సౌకర్యం ఉంటుంది కాబట్టి విహారయాత్రలకూ ఎంచక్కా వెంటబెట్టుకుపోవచ్చు.


అవెన్‌లోనే పాప్‌కార్న్‌...

వారాంతాల్లో సినిమా చూసేటప్పుడో లేదా సరదాగా తినాలనిపించినప్పుడో అప్పటికప్పుడు పాప్‌కార్న్‌ సిద్ధం చేసుకోవాలంటే కొంచెం కష్టం. మరి అనుకున్నదే తడవుగా తయారుచేసుకోవాలంటే అందుకు తగిన పాత్ర ఉండడమూ ముఖ్యమే. ఆ పని ఈజీ చేసేందుకు వచ్చిందే ఈ ‘పాప్‌కార్న్‌ పాపర్‌’.  ఈ పాపర్‌లో జొన్నలు వేసి మూత పెట్టేసి అవెన్‌లో ఉంచడమే. దాంతోపాటే ఆ మూతలోనే కొంచెం వెన్న లేదా నూనె వేసి ఉంచితే సరి. ఒక్కో చుక్కా ఆ జార్‌లో పడుతూ పాప్‌కార్న్‌ చక్కగా రెండు మూడు నిమిషాల్లోనే రెడీ అవుతుంది. దీనిపై ఉండే మూతను కొలత కోసం కూడా ఉపయోగించుకోవచ్చు. అంటే మల్టీపర్పస్‌ లిడ్‌ అన్నమాట. 


నింపడం తేలికే...

పాలు, జ్యూస్, తేనె, నూనె, స్మూతీల్లాంటి వాటిని గాజు సీసాల్లో నింపుతుంటాం కదా! అయితే, సన్నని ద్వారం ఉన్నప్పుడు వాటిలో నింపడం కష్టం. అలాంటప్పుడు ఈ లాంగ్‌ నోస్‌ ఫన్నెల్‌ను తెచ్చేయండి. ఈజీగా బాటిళ్లలో పానీయాలు, సన్నని దినుసుల లాంటివేవైనా నింపుకోవచ్చు. రంగురంగుల కార్టూన్ల రూపంలో ఇవి దొరుకుతున్నాయి. కాబట్టి కిచెన్‌లో ఎక్కడ వేలాడదీసినా కూడా అదో డెకరేటివ్‌ పీస్‌లానూ ఉంటుంది.  

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్