ఆ గుర్తుల గుట్టు ఇదే..!

సాధారణంగా మనం వాడే టూత్‌పేస్టుల అడుగుభాగంలో ఎరుపు, ఆకుపచ్చ, నీలం, నలుపు రంగులు చూస్తుంటాం కదా. ఆ రంగులు ఆకుపచ్చ అయితే సహజ పదార్థాలతో చేసినవనీ, నలుపైతే రసాయనాలతో చేసినవనీ అనుకుంటాం.

Published : 29 Jun 2024 01:40 IST

సాధారణంగా మనం వాడే టూత్‌పేస్టుల అడుగుభాగంలో ఎరుపు, ఆకుపచ్చ, నీలం, నలుపు రంగులు చూస్తుంటాం కదా. ఆ రంగులు ఆకుపచ్చ అయితే సహజ పదార్థాలతో చేసినవనీ, నలుపైతే రసాయనాలతో చేసినవనీ అనుకుంటాం. కానీ అది పూర్తిగా అపోహ మాత్రమే. ఆ గుర్తులు మాన్యుఫాక్చరింగ్‌ ప్రాసెస్‌లో భాగంగా ఉంచేవట. వీటిని చదివి లైట్‌ బీమ్‌ సెన్సర్లు... ఎక్కడ మడవాలి, కత్తిరించాలి, సీల్‌ చేయాలనే సిగ్నల్‌ను యంత్రాలకు అందిస్తాయట! పైగా అది ఈ నాలుగు రంగులకే పరిమితమవదట. సెన్సర్లూ, మెషీన్ల రకాలను బట్టీ ఈ ఛాయలు మారుతుంటాయట. ఈ రంగుల వెనక గుట్టు అదన్నమాట!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్