అలంకరణలోనే అవసరమైనవన్నీ..!

బుజ్జాయిల గది వారిని ఉత్సాహంగా ఉంచేలా మాత్రమే కాకుండా విజ్ఞానాన్నీ ఇచ్చేలానూ ఉండాలి. అలాగే జీవితపు విలువలను నేర్పించేలా, లక్ష్యాన్నీ అందించేలా ఆ గదిని అలంకరించాలి.

Published : 30 Jun 2024 01:56 IST

బుజ్జాయిల గది వారిని ఉత్సాహంగా ఉంచేలా మాత్రమే కాకుండా విజ్ఞానాన్నీ ఇచ్చేలానూ ఉండాలి. అలాగే జీవితపు విలువలను నేర్పించేలా, లక్ష్యాన్నీ అందించేలా ఆ గదిని అలంకరించాలి. మొత్తానికి అవసరమైనవన్నీ ఎదురుగా ఉంచితేనే వారి వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించగలుగుతాం.


గది గోడలకు...

ప్రముఖుల సందేశాలున్న చార్ట్స్‌ తీసుకోవాలి. తేలికైన వాక్యనిర్మాణంతో చూడటానికి ఆకర్షణీయమైన వాటిని ఎంపిక చేసి చిన్నారుల గది గోడకు వేలాడదీయాలి. రంగురంగుల బొమ్మలతో లేదా కలర్‌ఫుల్‌ లెటర్స్‌తో అందంగా కనిపించే ఈ పోస్టర్లు పిల్లలు ఆసక్తిగా చదివేలా చేస్తాయి. వ్యక్తిత్వ నిర్మాణానికి కావాల్సిన లక్షణాలను వీటి ద్వారానూ పిల్లలకు అందివ్వొచ్చు. అలాగే తేదీ తెలిసేలా ప్రతి నెల ప్రత్యేకంగా రంగులతో తీర్చిదిద్దిన క్యాలెండర్‌ పేజీ వారికెదురుగా అంటించాలి.


క్యాలెండర్‌లా...

ప్రత్యేకంగా వస్తున్న బోర్డ్‌బాక్సును వాళ్లకు అందేలా గోడకు అమర్చాలి. క్యాలెండర్‌లా ఉండే ఇందులో ఆ రోజు చేయాల్సిన పనుల గురించి బొమ్మలతో చిన్న కార్డులుంటాయి. ఆ పనులు పూర్తి అయితే తిప్పి ఉంచడం లేదా చేయాల్సిన వాటిని కనిపించేలా సర్దమని చెప్పాలి. ఉదయం స్కూల్, ఆ తర్వాత హోంవర్క్, ఆడుకోవడం, పుస్తక పఠనం, తోటపని వంటివన్నీ ఈ కార్డుల్లో బొమ్మల్లా ఉంటాయి. వీటిని ఏరోజుకారోజు పూర్తిచేసేలా టార్గెట్‌ ఇవ్వడం, ఆ తర్వాత అభినందిస్తే  చాలు. క్రమశిక్షణ, దాంతోపాటు సమయపాలన అలవడుతుంది. 


ఆహారనియమాలతో...

రోజూవారీ శరీరానికి కావాల్సిన పోషకాహారంపై అవగాహన కలిగించేలా చార్ట్‌ పిల్లల గదిలో తప్పనిసరి. అలాగే అందులో ఏ కూరగాయల్లో ఏమేం పోషకాలుంటాయో కూడా వివరాలుండేలా చూడాలి. రంగు రంగుల ఈ పోస్టరు చిన్నారులకు ఆహారం విలువ తెలియజేస్తుంది. 

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్