బండ రాళ్లు కావివి..!

ఏంటి? రాళ్లన్నీ తెచ్చి ఇంట్లో పెట్టుకున్నారు అనుకుంటున్నారా! ఇవి రాళ్లు కాదు. అచ్చం అలా అనిపించే బెంచ్‌లూ, స్టూళ్లు. హాల్‌లో ఉండే సోఫాలూ, కుర్చీలూ ఒక రకమైన డిజైన్‌లో ఉంటాయి.

Published : 01 Jul 2024 02:06 IST

స్వీట్‌ హోమ్‌

ఏంటి? రాళ్లన్నీ తెచ్చి ఇంట్లో పెట్టుకున్నారు అనుకుంటున్నారా! ఇవి రాళ్లు కాదు. అచ్చం అలా అనిపించే బెంచ్‌లూ, స్టూళ్లు. హాల్‌లో ఉండే సోఫాలూ, కుర్చీలూ ఒక రకమైన డిజైన్‌లో ఉంటాయి. కానీ, అలాంటివే బయట కూడా ఉంటే అంతగా నప్పవు కదా! అందుకే ప్రదేశానికి తగినట్లూ ఫర్నిచర్‌ ఉండాలని అనుకుంటున్నారు ఇప్పుడంతా. అయితే, ఇవి సౌకర్యంగా ఉండడంతోపాటు కళాత్మకంగానూ ఉండేలా చూసుకుంటున్నారు. లివింగ్, గార్డెన్‌ ప్రదేశాలను ఆకర్షణీయంగా మార్చుకోవడం కోసం... ఎడెన్‌ బెంచ్, పెబల్‌ సీటర్లు, బ్లూమ్‌ కుర్చీలు, దేశీ స్టూళ్లు... వంటి ఎన్నో రకాలు సరికొత్తగా మార్కెట్లోకి వచ్చాయి. వీటిని ఫైబర్‌ రీ ఇన్‌ఫోర్స్‌డ్‌ పాలిమర్‌ (ఎఫ్‌ఆర్‌పీ), మౌల్డెడ్‌ కాంక్రీట్, గ్లాస్‌ ఫైబర్‌ వంటి మెటీరియళ్లతో తయారుచేస్తున్నారు. సహజసిద్ధమైన రాళ్లే అనుకునేంతగా చూపరుల కళ్లను కట్టిపడేస్తున్నాయి. వీటిని గార్డెన్, సిట్టింగ్, స్విమ్మింగ్‌ వంటి ఆహ్లాదరకర ప్రాంతాల్లో వేస్తే చాలు. చూడ్డానికి సింపుల్‌గా, సంప్రదాయంగానే కాదు.. మోడ్రన్‌గానూ మెప్పిస్తాయి. మీకూ నచ్చాయా మరి!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్