లైంగిక విషయాల గురించి తెలుసుకోవడం తప్పా..?

నాకు పద్దెనిమిదేళ్లు. టీవీలో మగ, ఆడ సన్నిహితంగా ఉండే సీన్లు వస్తే అమ్మానాన్నలు వెంటనే ఛానెల్‌ మార్చేస్తారు. తరగతిలో తోటివారు మాట్లాడుకుంటారు. కానీ నేను కాస్త ఎత్తు తక్కువగా, సన్నగా ఉండటంతో చిన్నపిల్లగా భావించి నాకెవరూ ఏమీ చెప్పరు.

Published : 05 Jul 2024 13:57 IST

నాకు పద్దెనిమిదేళ్లు. టీవీలో మగ, ఆడ సన్నిహితంగా ఉండే సీన్లు వస్తే అమ్మానాన్నలు వెంటనే ఛానెల్‌ మార్చేస్తారు. తరగతిలో తోటివారు మాట్లాడుకుంటారు. కానీ నేను కాస్త ఎత్తు తక్కువగా, సన్నగా ఉండటంతో చిన్నపిల్లగా భావించి నాకెవరూ ఏమీ చెప్పరు. ఫోన్‌లో వెతుకుదామంటే అస్తమానం అమ్మానాన్నల నిఘా ఉంటుంది. సైన్స్‌ విద్యార్థినిని కదా... నాకేమో తెలుసుకోవాలని ఆసక్తి. నేరుగా అడిగితే ‘ఛీ అవేం మాటలు’ అంటున్నారు. దీని గురించి తెలుసుకోవడం తప్పా?

ఓ సోదరి

ద్దెనిమిదేళ్ల పరువంలో కొన్ని విషయాలు తెలుసుకోవాలనే ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. అది చాలా సహజం కూడా. కానీ, తొందర పనికి రాదు. నీ తరగతిలో పిల్లలు కూడా నీ వయసు వాళ్లే కాబట్టి, తెలిసీ తెలియకా మాట్లాడుతూ ఉండవచ్చు. వాళ్లకున్నది  కూడా మిడిమిడి జ్ఞానమే. వాటిని వింటే నువ్వూ తప్పుడు భావనలు, అర్థాలను పెంచుకోవచ్చు. ఇప్పుడు ఇంటర్నెట్‌ అందరికీ అందుబాటులోకి రావడంతో నీలాంటి పిల్లలందరూ అశ్లీల వెబ్‌సైట్లలో చూపించే సాన్నిహిత్యాన్ని చూసి, అదే వాస్తవమనుకొని అనవసర ఇబ్బందులకు గురవుతున్నారు. ఆ భయంతోనే అమ్మానాన్నలూ పిల్లలపై ఆంక్షలు పెట్టేది కూడా. అదేమో మీకు అనుమానిస్తున్నారు, నిఘా పెడుతున్నారన్న భావన కలిగిస్తుంది. మాపై నమ్మకం లేదంటూ తిరిగి బాధపడుతుంటారు కూడా. నిజానికి విద్యార్థులు తప్పటడుగు వేయొద్దని స్కూళ్లు, కాలేజీల్లోనూ ‘లైంగిక విద్య’పై అవగాహన కలిగించాలన్న ప్రతిపాదన వచ్చింది. ఆచరణలోనే సాధ్యం కాలేదు. ఎలాగూ సైన్స్‌ విద్యార్థినివే కదా! నువ్వు కోరుకునే పరిజ్ఞానం సైన్స్‌ జర్నల్స్‌లో దొరుకుతుంది. గెస్ట్‌ లెక్చర్లు, వర్క్‌షాప్‌ల ద్వారా శాస్త్రీయ విధానంలో అవగాహన కలిగిస్తున్న వేదికలూ బోలెడు. ముందుకు సాగే క్రమంలో నెమ్మదిగా పరిచయం అవుతాయి. పెరిగే వయసుకు తగ్గ పరిపక్వత కూడా నీకొస్తుంది. అప్పుడు మరింతగా అర్థం చేసుకోగలుగుతావు. అప్పటివరకూ చదువు, కెరియర్‌పై దృష్టిపెడుతూ వెళ్లు. వసంతం రాకముందే కోయిల కూయదు కదా! 

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్