అలలు... గోడెక్కాయి!

కాసేపు సముద్రం ఒడ్డునో, నది తీరానో కూర్చుంటే ఎంత ప్రశాంతత! ఎంతసేపు చూసినా ఆ అలలనూ, కెరటాలనూ అలానే చూస్తూ ఉండాలనిపిస్తుంది. మరి ఆ హాయి, ఇంట్లోనూ ఉంటే ఇంకా బావుంటుంది కదా! అందుకే ఇప్పుడు ‘ఓషన్‌ థీమ్‌’తో గోడ గడియారాలు మార్కెట్లోకి వచ్చేశాయి.

Published : 08 Jul 2024 01:43 IST

కాసేపు సముద్రం ఒడ్డునో, నది తీరానో కూర్చుంటే ఎంత ప్రశాంతత! ఎంతసేపు చూసినా ఆ అలలనూ, కెరటాలనూ అలానే చూస్తూ ఉండాలనిపిస్తుంది. మరి ఆ హాయి, ఇంట్లోనూ ఉంటే ఇంకా బావుంటుంది కదా! అందుకే ఇప్పుడు ‘ఓషన్‌ థీమ్‌’తో గోడ గడియారాలు మార్కెట్లోకి వచ్చేశాయి. సముద్ర తీరంలాంటి పెయింటింగ్, అందులోని ఇసుక, రాళ్లూ, గవ్వలూ, ఆకులూ, శంఖాలు... వంటివన్నీ ఉండేలా వీటిని తయారుచేస్తున్నారు. ఇవన్నీ కిందపడిపోకుండా రెసిన్‌తో కోటింగ్‌ వేసి, గ్లాసీ లుక్‌ తీసుకొస్తున్నారు. డిజిటల్, ఎనలాగ్‌ స్టైల్‌... ఏది కావాలంటే దాన్లో సమయం చూసుకునేలానూ ఎంచుకోవచ్చు. ఈ గడియారాలను లివింగ్‌రూమ్, పడకగది, డైనింగ్‌ రూమ్, వంటగది, ఆఫీస్‌... ఎక్కడైనా గోడకు తగిలించుకోవచ్చు. రోజూ ఆ గడియారాలను చూస్తుంటే... ప్రకృతికి దగ్గరగా ఉన్నామన్న భావన కలుగుతుంది. అంతేకాదు, వీటిపై ఫొటో వేయించి... మన స్నేహితులూ, బంధువులకు పుట్టినరోజు, పెళ్లిరోజులకు బహుమతిగానూ ఇవ్వొచ్చు. మీకూ నచ్చాయా! అయితే, ఈ అందమైన అలల గడియారం ఇంట్లో పెట్టేయండి మరి!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్