ఏసీనే కావాలా ఏంటి?

బయట ఎండలో కాసేపు ఉంటే చాలు. సూర్యుడు మనలోని శక్తినంతా స్ట్రా వేసుకుని పీల్చుకున్నట్లే ఉంటుంది. అలాంటప్పుడు ఇంట్లోకి వచ్చీ రాగానే చల్లగాలి కావాలనుకుంటాం కదా! ఇప్పుడంటే ఏసీల వాడకం ఎక్కువయింది కానీ, నిజానికి టేబుల్‌ ఫ్యాన్‌ ఇచ్చే గాలి ప్రశాంతతే వేరు.

Published : 08 Jul 2024 04:21 IST

బయట ఎండలో కాసేపు ఉంటే చాలు. సూర్యుడు మనలోని శక్తినంతా స్ట్రా వేసుకుని పీల్చుకున్నట్లే ఉంటుంది. అలాంటప్పుడు ఇంట్లోకి వచ్చీ రాగానే చల్లగాలి కావాలనుకుంటాం కదా! ఇప్పుడంటే ఏసీల వాడకం ఎక్కువయింది కానీ, నిజానికి టేబుల్‌ ఫ్యాన్‌ ఇచ్చే గాలి ప్రశాంతతే వేరు. బాగా చెమటలు పట్టి, ఉక్కపోతగా ఉన్నప్పుడు అలా ఫ్యాన్‌ ముందు ముఖం ఉంచితే చాలు. మనసంతా ఊహాలోకంలో రెక్కలు కట్టుకుని విహరిస్తున్నట్లు అనిపిస్తుంది. గిరగిరా తిరిగే రెక్కల గాలి, మనల్ని స్వేచ్ఛాలోకంలోకి తీసుకెళ్తుంది. అంతెందుకు, హాయిగా సోఫాలో కూర్చుని కళ్లు మూసుకుంటే... ఏదో సముద్ర తీరాన వీచే చల్లగాలే మనల్ని తాకుతున్నట్లు ఉంటుంది. ప్రస్తుతం హెయిర్‌ డ్రయ్యర్‌లు వచ్చాక మనం దీన్ని పట్టించుకోవడం లేదు కానీ అంతకుముందు తలస్నానం చేశాక మన జుట్టుని ఫ్యాన్‌ దగ్గర ఆరబెట్టుకోవడం, ఆ ఎగురుతున్న జుట్టును చూసి చిన్నపాటి దేవకన్యగా ఫీలవడం అదో థ్రిల్‌. ఇక, చిన్నప్పుడు ఈ టేబుల్‌ ఫ్యాన్‌ ముందు నిలబడి మాట్లాడితే... జుయ్‌జుయ్‌మని శబ్దం రావడం... భలే సరదా ఆట. ఏంటి? ఈ అనుభూతి మీకూ కావాలనిపిస్తోందా? అయితే, ఓసారి పంకా స్విచ్‌ ఆన్‌ చేయాల్సిందే!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్