అప్పుడు వద్దనుకున్నా... ఇప్పుడు ఒంటరినయ్యా!

అమ్మానాన్నలకు నేను ఏకైక సంతానం. ఇరవైల్లో పెళ్లి చేసుకోకూడదని నిర్ణయించుకున్నా. తరవాతా వాయిదా వేస్తూ వచ్చా. ఉద్యోగం చేస్తూ... జీవితాన్ని ఆస్వాదించా. ఇప్పుడు నాకు 50ఏళ్లు. ఏడాదిక్రితం తల్లిదండ్రులు ఇద్దరూ చనిపోయారు.

Published : 08 Jul 2024 15:25 IST

అమ్మానాన్నలకు నేను ఏకైక సంతానం. ఇరవైల్లో పెళ్లి చేసుకోకూడదని నిర్ణయించుకున్నా. తరవాతా వాయిదా వేస్తూ వచ్చా. ఉద్యోగం చేస్తూ... జీవితాన్ని ఆస్వాదించా. ఇప్పుడు నాకు 50ఏళ్లు. ఏడాదిక్రితం తల్లిదండ్రులు ఇద్దరూ చనిపోయారు. బంధుమిత్రులు వారి వారి జీవితాల్లో బిజీ. ఒక్కసారిగా ఒంటరినయ్యా అనిపిస్తోంది. మిగిలిన జీవితం ఎలా గడపాలో తెలియడం లేదు. సలహా ఇవ్వండి.

ఓ సోదరి

సమాజంలో చాలామంది వాళ్ల వాళ్ల కట్టుబాట్లను అనుసరించి వారికంటూ ఒక కుటుంబాన్ని ఏర్పరచుకుంటారు. అయితే, కొంతమంది తల్లిదండ్రులను చూసుకోవడం కోసమో, కెరియర్‌ మీద మరింత శ్రద్ధ పెట్టాలనో, లేదా కొన్ని భయాలూ, అపోహల వల్లనో పెళ్లి గురించి ఆలోచించరు. వయసులో ఉన్నప్పుడు వాళ్లకు ఎటువంటి అభద్రతాభావాలూ ఉండవు. స్నేహితులూ, బంధువులూ, వారి పిల్లలతో సమయం గడిచిపోతుంటుంది. కానీ, ఇలా ఆకస్మికంగా తల్లిదండ్రులు దూరమయ్యాక వారిలో అభద్రతాభావం పెరుగుతుంది. మీ మీద ప్రేమ ఉన్నా కూడా మిగతా కుటుంబ సభ్యులు వాళ్ల బాధ్యతల్లో పడిపోయి సమయం గడపలేకపోవచ్చు. అలాంటప్పుడు ఒంటరినయ్యా అన్న ఫీలింగ్‌ వస్తుంది. అయితే, మీరు మొదటినుంచీ పెళ్లిచేసుకోకూడదని నిర్ణయించుకున్నారు. కాబట్టి, మీకు అప్పటినుంచీ పుస్తకాలు చదవడం, సంగీతం నేర్చుకోవడం వంటి అలవాట్లు ఉంటే, అవి మీకు ఇప్పుడు బాగా ఉపయోగపడతాయి. ఒకవేళ అలాంటివేవీ లేకుంటే మీరు మెడికల్‌ క్యాంపులూ, వరద బాధితులకు సాయం చేసే సేవా సంస్థల్లో వాలంటీర్‌గానూ చేరొచ్చు. అనాథాశ్రమాల్లోని వారికి సేవలందించొచ్చు. వీటితోపాటు సమయం కుదుర్చుకొని మీ బంధుమిత్రులతోనూ సమయం గడపండి. వీటన్నింటి వల్ల మీరు కొత్త విషయాలు నేర్చుకుంటారు. ఒంటరితనం పోయి, ఉల్లాసంగానూ, ఆత్మసంతృప్తితోనూ ఉండగలుగుతారు. కొత్త ఆశలు చిగురించి, మిగిలిన జీవితాన్ని ఆనందంగా గడపగలుగుతారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్