ఇండోర్‌ మొక్కలకూ... వర్షం నీరు

ఇంట్లో డైనింగ్‌ టేబుల్‌ లేదా కిటికీలో ఉండే ఇండోర్‌ మొక్కలకు ఈ సీజన్‌లో వర్షపు నీటిని అందేలా చేయొచ్చు. అలాగని భారీ వర్షంలో కాకుండా చిన్న చినుకులు పడే చోట వీటిని ఉంచితే అవి చక్కగా పెరుగుతాయి.

Published : 09 Jul 2024 01:33 IST

ఇంట్లో డైనింగ్‌ టేబుల్‌ లేదా కిటికీలో ఉండే ఇండోర్‌ మొక్కలకు ఈ సీజన్‌లో వర్షపు నీటిని అందేలా చేయొచ్చు. అలాగని భారీ వర్షంలో కాకుండా చిన్న చినుకులు పడే చోట వీటిని ఉంచితే అవి చక్కగా పెరుగుతాయి.

ర్షపునీరు మొక్కలకు పలు ప్రయోజనాలనిస్తుంది. సాధారణంగా పంపు నీటిలో లవణాలు, ఖనిజాలుంటాయి. ఈ నీటిని మొక్కలకు పోయడంవల్ల ఇవన్నీ తొట్టెలోని మట్టిలో కరిగి ఉంటాయి. ప్రత్యేకంగా కాల్షియం, మెగ్నీషియం ఎక్కువగా చేరిపోతాయి. దాంతో మట్టిపై కాల్షియం కార్బొనేట్‌ పొర ఏర్పడుతుంది. ఫలితంగా మట్టి ఎండిపోయినట్లు అయ్యి నీటిని పీల్చుకోదు. మొక్కకు ఆక్సిజన్‌ అందనివ్వదు. అయితే వర్షపునీరు సహజంగా మృదువైంది. ఇది తొట్టెలో పేరుకున్న ఖనిజాలను బయటకు పంపడంలో సహాయపడి, మొక్క ఆరోగ్యంగా పెరిగేలా చేస్తుంది. ఆకులపై ఉండే రంధ్రాలను వర్షపునీరు తెరిచేలా చేస్తుంది. దీంతో కిరణజన్య సంయోగక్రియ కోసం కార్బన్‌ డయాక్సైడ్, పోషకాలను తీసుకునే సామర్థ్యాన్ని మెరుగుపడేలా చేస్తుంది. దీంతో మొక్క ఎదుగుదల బాగుంటుంది.

ఏం చేయాలి...

సాధారణంగా ఇండోర్‌ మొక్కల తొట్టెల్లోని మట్టి చెమ్మగా ఉంటుంది. వీటిని గాలి ఎక్కువగా వీచకుండా చిన్నగా పడుతున్న వర్షంలో ఉంచితే దెబ్బ తినవు. వర్షపునీటిలో ఎక్కువ ఆక్సిజన్‌ ఉంటుంది. దీంతో తొట్టెలో నీరు నిండిపోయినా మొక్కకు అంతగా ప్రమాదం ఉండదు. అలాగని ఎక్కువ వర్షంలో లేదా ఎక్కువ సేపు మాత్రం ఇండోర్‌ మొక్కలను ఉంచకూడదు. అలాగే రాత్రి సమయాల్లో బయట వదిలేయకుండా ఇంట్లోకి తేవడం మంచిది. పగటిపూట వర్షం వెలిసిన తర్వాత కూడా మొక్కను బయట ఉంచకూడదు. వర్షం తర్వాత వచ్చే ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంవల్ల మొక్క దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. ఈ వర్షాకాలంలో తగినంత వర్షపాతాన్ని గుర్తించి మీ ఇండోర్‌ మొక్కలనూ మరింత ఆరోగ్యంగా ఎదిగేలా చేయండి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్