వస్తువు చిన్నది... ప్రయోజనం పెద్దది!

ఒక్కోసారి చిన్న ఆలోచన కూడా భలే ప్రయోజనాలనిస్తుంది కదా! అలా కనిపెట్టినవే ఈ వంటింటి పరికరాలు కూడా. ఓసారి చూసేయండి మరి.

Published : 10 Jul 2024 01:11 IST

ఒక్కోసారి చిన్న ఆలోచన కూడా భలే ప్రయోజనాలనిస్తుంది కదా! అలా కనిపెట్టినవే ఈ వంటింటి పరికరాలు కూడా. ఓసారి చూసేయండి మరి.

ఎప్పుడు కావాలన్నా...

సాధారణంగా వంటింటి వ్యర్థాలను మనం చెత్తబుట్టలో వేస్తుంటాం. అయితే, వాటిని నేరుగా అలానే పడేయకుండా ఏదైనా కవర్లో వేసి, పడేస్తాం కదా! అటువంటప్పుడు కవర్ల కోసం వెతకకుండా వెంటనే చేతికందితే బావుండు అనిపిస్తుంది. అందుకు ఈ హ్యాంగింగ్‌ స్టోరేజీ బ్యాగు బాగా ఉపయోగపడుతుంది. దీన్ని వంటగదిలో ఓ గోడకు తగిలించుకుంటే సరి. ఎప్పటికప్పుడు కవర్లను ఈ బ్యాగులో వేస్తే, వెతుక్కోకుండా వెంటనే తీసి, వాడుకోవచ్చు.


గాజు బాటిళ్లకోసం...

పొడుగ్గా ఉండి, సన్నని ముఖద్వారం ఉన్న గాజు బాటిళ్లను శుభ్రపరచడం కష్టమే. పాలు, తేనె, నూనె... లాంటివి ఉంచినవి అయితే, మరింత లోతుగా క్లీన్‌ చేయాల్సి ఉంటుంది. పైగా గాజువి కాబట్టి, జాగ్రత్తగా కడగాలి. అందుకోసం ఈ సిలికాన్‌ బ్రష్‌ను తీసుకురండి. దీని పొడవైన హ్యాండిల్‌తో,  బాటిల్‌ అడుగువరకూ క్లీన్‌ చేయడం తేలికవుతుంది. పైగా దీనికి ఉండే మెత్తని పళ్ల వల్ల సీసా మీద ఎటువంటి గీతలు పడతాయన్న భయమూ ఉండదు.


పిల్లలకు నచ్చేలా...

మామూలుగా పిల్లలు క్యారెట్, ముల్లంగి లాంటివి తినడానికి ఇష్టపడరు. కానీ, మనం కొంచెం సృజనాత్మకంగా ఆలోచిస్తే తినిపించడం తేలికే. అందుకు ఉపయోగపడేవే ఈ వెజిటేబుల్‌ కర్లర్లు. ఇవి చూడ్డానికి అచ్చం పెన్సిల్‌ చెక్కు మరల్లానే ఉంటాయి. వీటితో రకరకాల ఆకారాల్లో క్యారెట్‌ లాంటి కూరగాయలను కర్ల్‌ రిబ్బన్లుగా, చుట్టలుగానూ చెక్కేయొచ్చు. వీటిని సలాడ్లు, లంచ్‌ బాక్సుకోసం చేసే వంటల్లో వాడితే, ఆహారం మరింత ఆకర్షణీయంగా కనిపిస్తుంది. పిల్లలూ తినడానికి ఇష్టపడతారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్