తిరిగి ఉత్సాహం పొందేదెలా..?

ఉద్యోగంలో చేరి ఏడేళ్లు అవుతోంది. పని చేయడం బాగానే ఉన్నా, ఎందుకో గత కొన్ని నెలల నుంచి అందులో కొత్తదనం ఏమీ కనిపించట్లేదు. రోజూ అదే పని చేస్తున్నా అనే భావన కలుగుతోంది. ఒక్కోసారి మానేద్దామా అనీ అనిపిస్తోంది. తిరిగి నేను ఉత్సాహం పొందేదెలా?

Updated : 10 Jul 2024 13:25 IST

ఉద్యోగంలో చేరి ఏడేళ్లు అవుతోంది. పని చేయడం బాగానే ఉన్నా, ఎందుకో గత కొన్ని నెలల నుంచి అందులో కొత్తదనం ఏమీ కనిపించట్లేదు. రోజూ అదే పని చేస్తున్నా అనే భావన కలుగుతోంది. ఒక్కోసారి మానేద్దామా అనీ అనిపిస్తోంది. తిరిగి నేను ఉత్సాహం పొందేదెలా?

ఓ సోదరి

కెరియర్‌లో ఏదో ఒక దశలో ఇలా అనిపించడం సహజమే. మీరు దాన్ని గుర్తించి, మార్పు రావాలని కోరుకోవడం మంచి ఆలోచన. అయితే, చాలామంది ఉద్యోగులకు వారాంతం తర్వాత ఆఫీసుకి వెళ్లాలంటే నిరుత్సాహపడుతుంటారు. కొంతమంది అయితే, జీతం కోసమే పనిచేస్తున్నామనీ అంటుంటారు. అందుకు కారణం పనిలో కొత్తదనం లేదని వాళ్లు భావించడమే. అలా అనుకుని పనిచేస్తే మాత్రం దీర్ఘకాలంలో ఏ ఉద్యోగమూ సంతోషాన్ని ఇవ్వదు. పైగా మనం రోజులో ఎక్కువ సమయం ఆఫీసులోనే ఉంటాం. కాబట్టి, చేసే పనిని నచ్చేలా చేసుకునే బాధ్యత మనదే. కొందరికి ఎక్కువ సమయం కూర్చొనే పనిచేయాల్సి ఉంటుంది. ఈ పరిస్థితి కూడా విసుగుకీ, డీమోటివేషన్‌కీ కారణమే. అలాంటప్పుడు... మీరు శరీరాన్ని యాక్టివ్‌ చేసుకోవడానికి కొంత సమయం కేటాయించుకోండి. రోజుకి కనీసం అరగంటైనా సరే... ఏదైనా వర్క్‌వుట్‌ చేయండి. శారీరక శ్రమ వల్ల ఎండార్ఫిన్లు విడుదలై నూతనోత్సాహం వస్తుంది. దాంతోపాటు మరీ విసుగ్గా అనిపిస్తే, పనికి కొంత విరామం తీసుకుని మళ్లీ మొదలుపెట్టండి. కుదిరితే కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడానికి ప్రయత్నించండి. ప్రస్తుత రోజుల్లో ఆన్‌లైన్లో అనేక సర్టిఫికేషన్‌ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. మీ ఉద్యోగార్హతను పెంచే లేదా మిమ్మల్ని ఉత్సాహపరిచే మరే కోర్సులో అయినా చేరి, నేర్చుకోవడం ప్రారంభించండి. ఇలా చేయడం వల్ల మనలో కొత్త ఉత్సాహం నిండుతుంది. తిరిగి పనిలో నిమగ్నమవడానికీ ఉపయోగపడుతుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్