గుడ్డు రోజూ తినొచ్చా?

నా వయసు 55... డయాబెటిస్‌ ఉంది. తరచూ కళ్లు తిరుగుతున్నాయి. రోజూ ఓ ఉడికించిన గుడ్డు తింటే నీరసం, కళ్లు తిరగడం తగ్గుతుందని ఇంట్లోవాళ్లు చెబుతున్నారు.

Published : 12 Jul 2024 12:28 IST

నా వయసు 55... డయాబెటిస్‌ ఉంది. తరచూ కళ్లు తిరుగుతున్నాయి. రోజూ ఓ ఉడికించిన గుడ్డు తింటే నీరసం, కళ్లు తిరగడం తగ్గుతుందని ఇంట్లోవాళ్లు చెబుతున్నారు. అలా తిన్నప్పుడు నిజంగానే కాస్త బాగుంటుంది. కానీ నాకు కొలెస్ట్రాల్‌ పెరుగుతుందేమోనని భయం. మరి ఈ వయసులో రోజూ తినొచ్చా?

మధుమేహులు తీసుకునే ఆహారంలో ప్రొటీన్‌ తప్పక ఉండాలి. అయితే అది ఎంత నాణ్యంగా అందుతోంది అనేదీ ప్రధానం. కాబట్టి, మీరు నిస్సందేహంగా గుడ్లను తినొచ్చు. అయితే ఎన్ని తీసుకోవాలన్నది మీరు తీసుకునే మిగతా ఆహారం, ప్రొటీన్‌ బట్టి ఉంటుంది. రోజూ ఒకటి మాత్రం కచ్చితంగా తీసుకోండి. లేదంటే వారానికి అయిదు గుడ్లయినా తినేలా చూసుకోండి. వీటితో శరీరంలో కొవ్వు కూడా పెరగదు. డయాబెటిస్‌ ఉన్నవాళ్లు రక్తంలో శాచ్యురేటెడ్‌ కొవ్వులు పెరగకుండా చూసుకోవాలి. అంతేకానీ గుడ్డు తిన్నంత మాత్రాన కొలెస్ట్రాల్‌ పెరగదు. ఎందుకంటే యాభై, అరవై ఏళ్ల వయసున్న మధుమేహులకు రోజూ ఓ ఉడికించిన గుడ్డు ఇచ్చినపుడు వాళ్లలో చెడు కొలెస్ట్రాల్‌ తగ్గి, మంచి కొలెస్ట్రాల్‌ పెరిగినట్లు అధ్యయనాలూ చెబుతున్నాయి. మీరు ఓసారి లిపిడ్‌ ప్రొఫైల్‌ అంటే రక్తంలో కొలెస్ట్రాల్‌ శాతం ఎంత ఉందో చెక్‌ చేయించుకోండి. దాని ప్రకారం నిపుణులను కలవండి. వారు కచ్చితంగా వారానికి ఎన్ని తినొచ్చో చెబుతారు. లేదంటే రోజూ ఒక ఉడికించిన గుడ్డు తినండి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్