రెండింటికీ ఉండాలి సరిహద్దు

ఇష్టంగా ఎంచుకున్న రంగంలో రాణించాలంటే... కష్టపడటం ఒక్కటే కాదు... అదనంగా పరిగణించాల్సిన విషయాలూ ఎన్నో ఉంటాయి.

Updated : 08 Dec 2022 19:40 IST

ఇష్టంగా ఎంచుకున్న రంగంలో రాణించాలంటే... కష్టపడటం ఒక్కటే కాదు... అదనంగా పరిగణించాల్సిన విషయాలూ ఎన్నో ఉంటాయి. అవేంటంటే...

* సహోద్యోగుల నుంచి ప్రశంసలే కాదు, విమర్శలూ ఎదురవుతాయి. ఎదిగే క్రమంలో వాటన్నింటినీ సానుకూలంగా తీసుకోవడం   అలవాటుగా మార్చుకోవాలి.
* సంస్థలో ఉండే సీనియర్లను గమనిస్తూ తరచూ మాట్లాడుతూ ఉంటే... వాళ్ల అనుభవాల నుంచి ఎంతో నేర్చుకోవచ్చు. ఎక్కడ పొరపాట్లు చేయకూడదో తెలుసుకోవచ్చు. అవి మీకు ఎప్పుడో ఒకప్పుడు ఉపయోగపడతాయి.
* పనిలో కష్టపడటం ముఖ్యమే కానీ... సృజనాత్మకతా అవసరమే. నలుగురి కన్నా భిన్నంగా ఆలోచించగలగాలి. వీటన్నింటితోనే గుర్తింపు లభిస్తుంది.
* పనికి సంబంధించి అన్ని విషయాలు తెలియకపోవచ్చు. అలాంటప్పుడు మొహమాటపడకుండా ఇతరుల సూచనలు తీసుకోవడానికి వెనుకాడకండి. అవసరం అనుకుంటే సహోద్యోగులకు పనిలో సాయం చేసేందుకు చొరవచూపాలి. ఇది మీలోని బృందస్ఫూర్తిని తెలియజేస్తుంది.
* ఒకసారి ఉద్యోగం వచ్చినంతమాత్రాన దానికే పరిమితం కాకూడదు. ఎప్పటికప్పుడు మీ అర్హతలు, నైపుణ్యాలు పెంచుకునేలా చూసుకోవాలి. ఇవి మీరు ఉన్నతంగా ఎదిగేందుకు తోడ్పడతాయి. మీకో గుర్తింపునూ తెస్తాయి.
* పనిలో ఉన్నప్పుడు కేవలం విధుల గురించే ఆలోచించాలి. వ్యక్తిగత విషయాలను ఆఫీసు వరకు తీసుకురాకూడదు. ఇంట్లో ఉన్నప్పుడు ఆఫీసు విషయాల ప్రస్తావన ఉండకూడదు. అంటే విధులకూ, ఇంటికీ సరిహద్దు అనేది చాలా అవసరం.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్