ముఖానికి క్యారెట్‌ క్రీం

క్యారెట్‌ను తినడమే కాకుండా, క్రీంలా తయారు చేసుకోవచ్చు. ఫ్రిజ్‌లో భద్రపరుచుకుని కొన్నాళ్లు వాడుకోవచ్చు. దీంతో ఈ వర్షాకాలంలో చర్మ సమస్యలకు దూరంగా ఉండొచ్చు. క్యారెట్‌ క్రీం తయారీ ఎలాగో చూద్దాం. క్యారెట్‌లోని విటమిన్‌ సి, బీటాకెరోటిన్‌ చర్మాన్ని ఆరోగ్యంగానే కాదు, మెరిసేలా చేస్తాయి.

Updated : 19 Jun 2021 01:11 IST

క్యారెట్‌ను తినడమే కాకుండా, క్రీంలా తయారు చేసుకోవచ్చు. ఫ్రిజ్‌లో భద్రపరుచుకుని కొన్నాళ్లు వాడుకోవచ్చు. దీంతో ఈ వర్షాకాలంలో చర్మ సమస్యలకు దూరంగా ఉండొచ్చు. క్యారెట్‌ క్రీం తయారీ ఎలాగో చూద్దాం. క్యారెట్‌లోని విటమిన్‌ సి, బీటాకెరోటిన్‌ చర్మాన్ని ఆరోగ్యంగానే కాదు, మెరిసేలా చేస్తాయి.

తయారీ విధానం... రెండు క్యారెట్‌ దుంపలను సన్నగా తురిమి బాగా ఆరనివ్వాలి. ఇందులోని తడి పోయిన తర్వాత ఒక సీసాలో వేసుకోవాలి. ఈ తురుము మునిగేలా కొబ్బరినూనె పోసి 24 గంటలపాటు నాననివ్వాలి. ఈ నూనెను వడకట్టి విడిగా తీసుకోవాలి. రెండుచెంచాల ఈ నూనెకు నాలుగుచెంచాల కలబంద గుజ్జును వేసి మెత్తని క్రీంలా అయ్యేవరకు కలపాలి. దీన్ని పొడిగా ఉండే సీసాలోకి మార్చి ఫ్రిజ్‌లో ఉంచుకుంటే చాలు. వారం రోజులకు పైగా నిల్వ ఉంటుంది. రాత్రి నిద్రపోయే ముందు, ఉదయం స్నానం చేసిన వెంటనే ఈ క్రీంను మాయిశ్చరైజర్‌గా వాడాలి. చర్మం మృదువుగా మారడమే కాదు, కాంతులీనుతుంది. మీరూ ప్రయత్నించి చూడండి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్