మృదువైన చర్మం కోసం...

పొడి, జిడ్డు ఎలాంటి చర్మానికయినా తేనె మంచిది. అర స్పూన్‌ తేనెను ముఖానికి రాసి ఇరవై నిమిషాల తర్వాత కడిగితే తేటగా ఉంటుంది. గ్లైకాలిక్‌ లేదా ఆల్ఫా హైడ్రాక్సిల్‌ ఆమ్లాలు ఏ చర్మానికయినా మంచిదే. వాటిలో దూదిని ముంచి కళ్లు, పెదాలకు తాకకుండా రాయాలి. చర్మం మీద సూక్ష్మంగా వేల మృత కణాలుంటాయి. కనుక వారానికి ఒకటి రెండు సార్లు మృతకణాలు తొలగిపోయేలా చేయాలి. అప్పుడే రక్తప్రసరణ బాగుంటుంది.

Published : 20 Jun 2021 01:17 IST

పంచదార వీలైనంత తగ్గించండి. అది వయసు మీదపడేట్టు చేస్తుంది. ప్రొటీన్లు, కాల్షియం, మాంసం, చేపలు, గుడ్లు, చిరు ధాన్యాలు, డ్రైఫ్రూట్స్‌ మొదలైనవి తగినంతగా తీసుకోండి. యాంటీ ఆక్సిడెంట్లు విస్తారంగా ఉండేే టమాట, క్యారట్‌, గుమ్మడి చర్మాన్ని సంరక్షిస్తాయి. వీటితోబాటు రోజుకు రెండు లీటర్ల నీళ్లు తాగితే చర్మం కాంతివంతంగా ఉంటుంది, వయసు కనిపించదు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్