పనులనూ పంచుకోండి

చాలామంది మగవాళ్లు ఇంటి పనులు చేయడం నామోషీగా భావిస్తారు. అది సరైన పద్ధతి కాదు... భార్యాభర్తలన్నాక ప్రేమాభిమానాలనే కాదు పనులనూ పంచుకోవాల్సిందే. ఈ విషయాన్ని మీ భాగస్వామికి అర్థమయ్యేలా, వివరంగా, సున్నితంగా చెప్పాల్సింది మీరే.

Published : 25 Jun 2021 01:27 IST

చాలామంది మగవాళ్లు ఇంటి పనులు చేయడం నామోషీగా భావిస్తారు. అది సరైన పద్ధతి కాదు... భార్యాభర్తలన్నాక ప్రేమాభిమానాలనే కాదు పనులనూ పంచుకోవాల్సిందే. ఈ విషయాన్ని మీ భాగస్వామికి అర్థమయ్యేలా, వివరంగా, సున్నితంగా చెప్పాల్సింది మీరే.
ముందే ప్రణాళిక...
పనులను విభజించుకునే ముందు ఇద్దరూ మాట్లాడుకుని ప్రణాళికను రూపొందించుకోవాలి. తన ఆఫీసు సమయాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలి. దానికి తగ్గట్టుగా పనులను పంచుకోవాలి. అయితే ఇద్దరూ సమానంగా పంచుకోవాలని మాత్రం పట్టుపట్టొద్దు. పని ఒత్తిడి, సమయం ఇలా అన్నీ చూసుకోవాలి.
సర్దుకుపోవాలి...
‘చెప్పిన ఒక్క పని సరిగా చేయలేదు. నేను చేసుకున్నా బాగా చేసుకునేదాన్ని...’ అంటూ కొందరు తమ అసహనాన్ని వ్యక్తపరుస్తుంటారు. ఇది సరైన పద్ధతి కాదు. అన్ని పనులూ అందరూ ఒకేలా చేయలేరనే విషయం తెలుసుకోవాలి. చేసిన పని కొద్దిగా బాగా లేకపోయినా వదిలేయాలే తప్ప తప్పులు వెతకొద్దు.
మరో ప్రత్యామ్నాయం...
ఇద్దరూ ఉద్యోగస్థులై... పనులతో తీరిక దొరక్కపోయినా, మీరొక్కరే చేసుకోలేకపోయినా ఇంటి పనులకి మనిషిని పెట్టుకోవడం మంచిది. లేదంటే ఈ పనులతో విసుగు, చిరాకు కలగొచ్చు. దాంతో ఇద్దరి మధ్యా గొడవలూ రావొచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్