కార్ట్‌లోకి వేసేముందు..

లాక్‌డౌన్‌ వల్ల చాలా మందికి ప్రధాన వ్యాపకం మొబైలే అయ్యింది. పైగా ఆన్‌లైన్‌ షాపింగ్‌ సాధారణమైంది. చాలామందికి ఇదో వ్యాపకంలా మారిందంటున్నారు నిపుణులు. ఓసారి మీరూ చెక్‌ చేసుకోండి.

Published : 25 Jun 2021 01:32 IST

లాక్‌డౌన్‌ వల్ల చాలా మందికి ప్రధాన వ్యాపకం మొబైలే అయ్యింది. పైగా ఆన్‌లైన్‌ షాపింగ్‌ సాధారణమైంది. చాలామందికి ఇదో వ్యాపకంలా మారిందంటున్నారు నిపుణులు. ఓసారి మీరూ చెక్‌ చేసుకోండి.
ఇప్పుడు సామాజిక మాధ్యమాలే   కాదు.. ఏ వెబ్‌సైట్‌ తెరిచినా కళ్లు చెదిరే ఆఫర్లతో ఈకామర్స్‌ అడ్వర్టైజ్‌మెంట్లే. తక్కువకే వస్తున్నాయని అవసరం లేకున్నా కార్ట్‌లోకి కొట్టేస్తున్నారు. పైగా ఒకదానికే పరిమితం కావడం లేదట.
‘స్నాక్స్‌’కూ డిమాండ్‌ పెరుగుతోంది. ఏ సమయంలోనైనా ఫుడ్‌ డెలివరీలు ఉంటుండటంతో కాస్త ఒత్తిడి అనిపించినా, తోచకపోయినా తిండి బాట పడుతున్నారట. కొత్త రుచుల వెదుకులాటా పెరిగిందని అధ్యయనాలు చెబుతున్నాయి.
ఇంటికే పరిమితమవడంతో కాస్మెటిక్స్‌ ఊసే లేదనుకుంటున్నారు. కానీ.. సహజ పదార్థాల పేరిట ఎన్నో అందుబాటులోకి వస్తున్నాయి. ఇవే కాదు.. ఇంటికి సంబంధించి కొత్త వస్తువులు, సామగ్రి ఇప్పటికే ఉన్న వాటినీ కొనేస్తున్నారట.
ఏం చేయాలంటే..

*  ఖర్చులకు ఇంత అని బడ్జెట్‌ నిర్ణయించుకుని దాన్నే ఉపయోగించుకోండి.
*  ఏదైనా కొనాలనుకుంటే 24 గంటలు ఆగాకే ఆ పని చేయండి. ఈలోపు అది నిజంగా అవసరమేనా? లేకుండా గడుస్తుందో లేదో పరిశీలించుకోవాలి.
*  తిండి మీద అతిగా ధ్యాస ఒత్తిడికి నిదర్శనం. దాన్ని తగ్గించువాలి. ఎప్పుడైనా తినాలనిపించినా ఇంట్లోని వాటికే ప్రాధాన్యం ఇవ్వండి. ఆరోగ్యం కూడా.
*  అందానికి కొత్తగా ప్రయత్నించాలంటే చేతి చమురే వదల్చనక్కర్లేదు. ఆ సహజమైన వాటితో మీరే ఇంట్లో ప్రయత్నించి చూడండి. డబ్బు ఆదా, అందం రెండూ దక్కుతాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్