సవాళ్లను స్వాగతించండి!

కాలం మారింది... లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో అబ్బాయిలతో పోలిస్తే అమ్మాయిలకు అడ్డంకులు కాస్త ఎక్కువ. ఈ సవాళ్లని ఎలా అధిగమించాలి? విజయానికి ఎలా చేరువ కావాలి అంటారా? మీకోసమే ఈ సూత్రాలు.

Published : 26 Jun 2021 01:44 IST

కాలం మారింది... లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో అబ్బాయిలతో పోలిస్తే అమ్మాయిలకు అడ్డంకులు కాస్త ఎక్కువ. ఈ సవాళ్లని ఎలా అధిగమించాలి? విజయానికి ఎలా చేరువ కావాలి అంటారా? మీకోసమే ఈ సూత్రాలు.

స్పష్టత అవసరం : ఆలోచనల్లో స్పష్టత ఉంటే... సగం సమస్యలు తీరినట్లే. కానీ అమ్మాయిలకు ఇల్లు, కుటుంబం, సమాజం.. ఇలా ఎన్నో విషయాలు ముందర కాళ్లకు బంధం వేస్తాయి. ఇలాంటప్పుడు మీ మనసులోని ప్రశ్నల్ని, వాటికి సానుకూల సమాధానాల్ని మాత్రమే ఓ పుస్తకంలో రాయండి. అవి మీకు దారిని చూపిస్తాయి.

వాస్తవికంగా లెక్కేసుకోండి... మీ లక్ష్యం వాస్తవికమైనదో కాదో ముందు గమనించుకోవాలి. మీ బలాలు, బలహీనతలపై పట్టు ఉండాలి. అవసరమైన నైపుణ్యాలను నేర్చుకోగలిగే చొరవ కావాలి. ఇవే మిమ్మల్ని గెలుపు బాటలో నడిపిస్తాయి. కాలం ఎంత మారినా... అమ్మాయిలపై వివక్ష అన్ని చోట్లా కొనసాగుతూనే ఉందని అధ్యయనాలెన్నో చెబుతున్నాయి. అలాగని అసలు మహిళలకు అవకాశాలే దొరకడం లేదని కాదు. ఆత్మస్థైర్యం, చొరవ, పోరాటపటిమ, కష్టపడే తత్వం ఉన్న వారికి గుర్తింపునీ, పదోన్నతులనూ తెచ్చిపెడతాయని చెబుతారు కెరీర్‌ నిపుణులు. మీరూ ఆ వైపు ఆలోచించండి.

అంగీకరించండి... కాలంతో పాటు మన చుట్టూ ఎన్నో మార్పులు జరిగిపోతూ ఉంటాయి. వాటిని గమనించుకోవాలి. మార్పులను అంగీకరించగలగాలి. అందుకు తగ్గట్లు అప్‌డేట్‌ అవ్వాలి. ఈ క్రమంలో కొన్నిసార్లు పరాజయం పదే పదే పలకరించ వచ్చు. దాన్నీ పాఠంగా మలుచుకుని ముందడుగు వేసే స్థైర్యం మీ సొంతం కావాలి. ఇందుకోసం స్మార్ట్‌గా ఆలోచించడం అలవాటు చేసుకోవాలి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్