పిల్లలు ఫిర్యాదులు చేస్తుంటే...

కొందరు చిన్నారులు ప్రతి సమస్యకూ ఇతరులపై ఫిర్యాదులు చేస్తుంటారు. దీన్ని చూసీ చూడనట్లు ఊరుకుంటే భవిష్యత్తులో వారు ప్రతికూల ఆలోచనలతో సతమతమయ్యే ప్రమాదం ఉంది.

Published : 27 Jun 2021 00:23 IST

కొందరు చిన్నారులు ప్రతి సమస్యకూ ఇతరులపై ఫిర్యాదులు చేస్తుంటారు. దీన్ని చూసీ చూడనట్లు ఊరుకుంటే భవిష్యత్తులో వారు ప్రతికూల ఆలోచనలతో సతమతమయ్యే ప్రమాదం ఉంది.

వాస్తవాన్ని గ్రహించేలా...: పిల్లలు ప్రతికూలంగా ఆలోచిస్తున్నారంటే... ముందు ఇంటి వాతావరణం ఎలా ఉందో గమనించుకోండి. సాధారణంగా ఈ అలవాటు అమ్మానాన్నల నుంచే వస్తుందంటారు మానసిక నిపుణులు.
సమస్యని గుర్తించండి: చిన్నారులు తరచూ ఇతరులపై ఫిర్యాదు చేస్తోంటే చూసీచూడనట్లు వదిలేయొద్దు. సమస్య లోతుని తెలుసుకోవడానికి మీ పాప/ బాబుతో స్నేహం చేయాలి. అసలు విషయాన్ని గుర్తించి... వారికి పరిష్కారాన్ని చూపించాలి. ఈ క్రమంలో మీ వాడిదే తప్పయితే సర్దిచెప్పడానికీ, అవసరమైతే సున్నితంగా మందలించడానికీ వెనుకాడొద్దు. విశ్లేషణాత్మకంగా...: కుటుంబం, సమాజంలో నిత్యం ఎవో సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. వాటన్నింటినీ ఒకే కోణంలో వారికి చూపించొద్దు. తప్పొప్పులు చెబుతూనే... పరిష్కారాల్నీ సూచించండి. అప్పుడే ప్రతికూల ఆలోచనలు దూరమై ప్రతి విషయాన్నీ సునిశితంగా పరిశీలించ గలుగుతారు. తొందరపాటుతో ఫిర్యాదులు చేయరు. తోటి చిన్నారులతో కలిసిపోవడం, సర్దుకుపోవడం వంటివి నేర్పాలి. ఇచ్చి పుచ్చుకోవడంలో ఉండే సంతోషాన్ని పరిచయం చేయాలి. ఇవన్నీ... పిల్లల్లో ఫిర్యాదు చేసే తత్వాన్ని తగ్గిస్తాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్