నాయకత్వం... సుదూర స్వప్నం ఇంకెన్నాళ్లు ?

అన్ని రంగాల్లో మహిళలు దూసుకుపోతున్నా నాయకత్వ బాధ్యతలు మాత్రం వారికి గగన కుసుమాలే అవుతున్నాయి. ముఖ్యంగా శాస్త్ర పరిశోధన రంగంలో మహిళా నాయకుల సంఖ్య ఏటికేడు తగ్గిపోతోంది.

Updated : 21 Nov 2022 16:36 IST

అన్ని రంగాల్లో మహిళలు దూసుకుపోతున్నా నాయకత్వ బాధ్యతలు మాత్రం వారికి గగన కుసుమాలే అవుతున్నాయి. ముఖ్యంగా శాస్త్ర పరిశోధన రంగంలో మహిళా నాయకుల సంఖ్య ఏటికేడు తగ్గిపోతోంది. విశ్వవిద్యాలయేతర పరిశోధనా సాయం (ఈఎంఆర్‌- మౌలిక సైన్స్‌ అంశాల శోధనకు కేంద్ర ప్రభుత్వ మద్దతు) పొందుతున్న కీలక ప్రాజెక్టుల్లో మహిళలు ప్రధాన పరిశోధకులుగా ఉన్న వాటి సంఖ్య 3 శాతం తగ్గిపోయిందని కేంద్ర ప్రభుత్వ తాజా నివేదిక ఒకటి స్పష్టం చేసింది. 2017-18లో 31 శాతంగా ఉన్న ఈ ప్రాజెక్టులు ఆ తర్వాత ఏడాదిలో 28 శాతానికి పడిపోయాయి. మొత్తంగా ఈఎంఆర్‌ కింద 4616 ప్రాజెక్టులకు రూ.2091 కోట్ల మేరకు కేంద్రం సాయం చేసింది. మహిళలు సహ, ప్రధాన పరిశోధకులుగా ఉన్న ప్రాజెక్టులు కూడా 17 శాతానికే పరిమితమయ్యాయి. ఉన్నత విద్యలో అమ్మాయిల సంఖ్య ఏటా పెరుగుతున్నా, శాస్త్ర పరిశోధనల్లోకి ప్రవేశించడానికి, వాటిలో కొనసాగడానికి వారికి అనేక అవాంతరాలు ఎదురవుతున్నాయి. పీహెచ్‌డీ పూర్తిచేసి శాస్త్ర పరిశోధనలను కెరీర్‌గా మార్చుకోవడంలో కీలకమైన 30 ఏళ్ల వయసుకు వచ్చేసరికి పెళ్లి - మాతృత్వం తదితరాలతో ఎక్కువ శాతం మంది కెరీర్‌ను వదులుకోవడమో, టీచింగ్‌ తదితర  రంగాలకు వెళ్లిపోవడమో అనివార్యమవుతోంది!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్