కాసింత చోటులో కాయగూరలు

ఎంతో స్థలముంటే తప్ప మొక్కలు పెంచలేమనుకుంటే పొరపాటే. కాసింత జాగాలో.. ఇంకా చెప్పాలంటే చిన్న చిన్న బాల్కనీల్లో, కుండీల్లోనే ఇంటిక్కావలసిన....

Published : 11 Jul 2021 00:44 IST

ఎంతో స్థలముంటే తప్ప మొక్కలు పెంచలేమనుకుంటే పొరపాటే. కాసింత జాగాలో.. ఇంకా చెప్పాలంటే చిన్న చిన్న బాల్కనీల్లో, కుండీల్లోనే ఇంటిక్కావలసిన కాయ గూరలు పండిస్తున్నారెందరో... అదెలానో చూడండి..

* బాల్కనీ బట్టలు ఆరబెట్టుకోడానికే కాదు, వంగ, బెండ, టొమేటో, మిరప లాంటి మొక్కలతో అందమైన తోటగా మార్చుకోవచ్చు. మట్టిలో వర్మికంపోస్ట్‌, కొబ్బరిపొట్టు కలిపితే సారవంతంగా తయారవుతుంది.

* మొక్కలకు సూర్యరశ్మి తగిలేలా చూడాలి. క్రమం తప్పక నీళ్లు పోయాలి. టీ పొడి, కూరగాయల వ్యర్థాలు, ఉల్లిపొట్టు ఎరువుగా వాడొచ్చు. ఎండిన వేపాకు పొడిని నీళ్లలో కలిపి చిలకరిస్తే మొక్కలకు పురుగు చేరదు.

* సాధారణ మొక్కలకు 14 అంగుళాల లోతైన కుండీలు సరిపోతాయి. దోస, సొర లాంటి తీగ పాదులకు నీళ్ల తొట్టి లేదా పెద్ద టబ్బు అనుకూలం.

* తోటకూర, గోంగూర, మెంతి, కొత్తి మీర, పుదీన లాంటివి త్వరగా పెరుగుతాయి.

* తక్కువ స్థలంలోనే ఎక్కువ కుండీలు అమరేలా స్టాండులు దొరుకుతాయి. కొన్ని కుండీలను కొక్కీలకు వేళ్లాడదీయొచ్చు. కొన్నిటిని కిటికీల్లోనూ పెట్టుకోవచ్చు. ఇంట్లో నీళ్లు కారకుండా కుండీని ట్రేలో పెట్టే మార్గమూ ఉంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్