కీళ్లనొప్పులకు చెక్‌ చెబుదామా...

ఇంటా బయటా ఊపిరాడని పనులతో ఉక్కిరిబిక్కిరయ్యే ఎందరో మహిళలు మెడ, నడుము, భుజాల నొప్పులతో సతమతమవడం తెలిసిందే.

Updated : 14 Jul 2021 17:08 IST

ఇంటా బయటా ఊపిరాడని పనులతో ఉక్కిరిబిక్కిరయ్యే ఎందరో మహిళలు మెడ, నడుము, భుజాల నొప్పులతో సతమతమవడం తెలిసిందే. ఇది తీవ్రమైతే ఏ పనీ చేయలేని అశక్తత ఆవరిస్తుంది. అదెంత ఇబ్బందో కదూ?! అలాంటి స్థితి రాకూడదంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందే మరి...

* నీళ్ల బకెట్‌ లేదా కూరగాయల్లాంటివి ఒకే చేత్తో మోయడం వల్ల మెడ, భుజం నొప్పి రావచ్చు. శక్తికి మించిన బరువు లేకుండా చూసుకోవాలి. అలాగే మధ్యలో చేయి మార్చుకుంటే సరి.

* కాల్షియం, మెగ్నీషియం, ప్రొటీన్లు, ఫైబర్‌, సి-డి-కె విటమిన్లు, ఒమేగా, ఫ్యాటీ యాసిడ్స్‌ (కొవ్వు ఆమ్లాలు) విస్తారంగా ఉండే పాలు, పెరుగు, గుడ్డు, బాదం, పిస్తా, నువ్వులు, గుమ్మడి గింజలు, బ్రొకోలి, సోయా, బఠాణి, పప్పుధాన్యాల్లాంటివి తగిన మోతాదులో తినడం వల్ల ఎముకలు పటిష్టంగా ఉంటాయి.

* కంప్యూటర్‌ పని చేస్తున్నప్పుడు మెడను స్టిఫ్‌గా పెట్టకుండా కాస్త కదిలిస్తుండాలి.

* కూర్చునే, పడుకునే భంగిమలు సరిగా లేకున్నా మెడ, నడుం నొప్పులొచ్చే అవకాశముంది.

* తరచుగా తలనొప్పి వస్తుంటే నిర్లక్ష్యం వద్దు. అది నరాలు, ఎముకలకు కూడా సమస్యగా పరిణమిస్తుంది.

* ఏకబిగిన పనిచేయడం వల్ల ఎముకల మీద భారం పడుతుంది. మధ్యలో చిన్న చిన్న వ్యాయామాలు చేయడం తప్పనిసరి.

* తినే ఆహారంలో ఉప్పు తగ్గించడం వల్ల కీళ్ల నొప్పులను చాలావరకూ నియంత్రించవచ్చు.

* ఖాళీ సమయంలో మెడ, భుజాలను కుడి నుంచి ఎడమకు, ఎడమ నుంచి కుడివైపుకు తిప్పండి. ఈ రొటేషన్‌ ఎక్సర్‌సైజ్‌ ఎంతో ఉపశమనాన్ని ఇస్తుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్