నొప్పిని తగ్గించేనెలసరి కప్పులు!

మనలో చాలామంది నెలసరిలో నొప్పితోపాటు తీవ్ర అసౌకర్యానికి లోనవుతాం. కొందరు ఆ నొప్పిని తగ్గించుకోవడానికి మాత్రలు వాడతారు. వీటివల్ల కొన్ని రకాల దుష్ప్రభావాలు ఉండొచ్చు.

Published : 16 Jul 2021 01:43 IST

మనలో చాలామంది నెలసరిలో నొప్పితోపాటు తీవ్ర అసౌకర్యానికి లోనవుతాం. కొందరు ఆ నొప్పిని తగ్గించుకోవడానికి మాత్రలు వాడతారు. వీటివల్ల కొన్ని రకాల దుష్ప్రభావాలు ఉండొచ్చు. ‘అబ్యాన్‌ నూర్‌’ రూపొందించిన ‘హీటెడ్‌ మెనుస్ట్రువల్‌ కప్‌’ ఈ సమస్యలన్నింటికీ చెక్‌ పెడుతుంది....

పరికరంలో కప్పు, రింగు అనే రెండు భాగాలుంటాయి. కప్పు రక్తాన్ని నిల్వ చేస్తే... రింగు వెచ్చదనాన్ని అందిస్తుంది. సిలికాన్‌తో తయారైన కప్పు పై భాగాన ఈ రింగును అమర్చుకోవచ్చు. వాడటానికీ సౌకర్యంగా ఉంటుంది.
‘నెలసరి సమయంలో మహిళలు నడుము, తల, కడుపు నొప్పులు; వికారం, వాంతులు... ఇలా రకరకాలుగా బాధపడుతుంటారు. దాంతో మానసికంగా, శారీరకంగా ఇబ్బంది పడతారు. ఈ సమస్యను తీర్చడానికి ఈ కప్పును తయారు చేశా. వేడిని అందించే ఈ మెనుస్ట్రువల్‌ కప్పు వల్ల నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.

దీనివల్ల ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవు. వయసు, సైజు, రక్తప్రవాహంతో సంబంధం లేకుండా ఎవరైనా వీటిని ఉపయోగించవచ్చు. యాత్రలు, ప్రయాణాల్లో చక్కగా వాడుకోవచ్చు. ట్రెక్కింగ్‌, రోడ్‌ ట్రిప్స్‌, సైట్‌ సీయింగ్‌, సాహసాలు చేసేవారు వీటిని ఎంచక్కా ఎంచుకోవచ్చు. పీఎమ్‌ఎస్‌ (ప్రీమెనుస్ట్రువల్‌ సిండ్రోమ్‌)తో బాధపడే మహిళలకు ఈ కప్పు వాడకం వల్ల నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది’ అని చెబుతోంది నూర్‌. ఈ కప్పులు పర్యావరణ హితమైనవి. వాడకం, శుభ్రం చేయడం కూడా సులభమే. ఈ ప్రత్యేకమైన కప్పుల గురించి ప్రచారం కల్పిస్తోన్న నూర్‌... వీటి ప్రచారానికి అండగా ఉండే వారికి వీటిని రాయితీపై అందించనుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్