Updated : 19/07/2021 15:09 IST

పాటని కట్టేసుకుంది!

షేర్నీ చీరంచుపై మెరిసిన ఠాగూర్‌ పాట

ఫ్యాషన్‌లో నూతన ఒరవడితో అందరినీ ఆకర్షించే నటి విద్యాబాలన్‌. తను తాజాగా రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ పాటను ప్రింట్‌ చేసిన చీర కట్టుకుని, ఆ ఫొటోలను ట్విటర్‌లో పెట్టింది. మారుమూల ప్రాంతాల్లోని చేనేత కళను సామాజిక మాధ్యమాల్లో పరిచయం చేస్తుంటుందీమె. ఈసారి రాజస్థాన్‌లోని ఓ గ్రామీణ నేత కళాకారుడి చేతిలో రూపు దిద్దుకున్న ఆరుగజాల చీరను కట్టుకుని మురిసిపోయింది. రెండువైపులా అంచుల మీద ప్రింట్‌ చేసిన ఈ పాట తన మనసులోని భావాల్ని వ్యక్తీకరిస్తోందంటూ కామెంట్‌ పెట్టింది. ఠాగూర్‌ రచించిన ‘ఎక్లా ఛోలో రే’ పాటను ఆయన అభిమాని అయిన ఓ నేతన్న సహజ వర్ణాలతో చీర మీద ప్రింట్‌ చేశాడు. ఠాగూర్‌ దీన్ని 1905లో బెంగాలీలో రాశారు. తర్వాత ఆయనే ఆంగ్లంలోకి తర్జుమా చేశారు. ‘నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌’లో, ఏఆర్‌రెహ్మాన్‌ ‘ద ఫర్‌గాటెన్‌ హీరో’ చిత్రంలో ఈ గీతాన్ని ఉపయోగించారు. బాపూజీకి చాలా ఇష్టమైన ఈ పాటను ‘కహానీ’ చిత్రం కోసం అమితాబ్‌ పాడటం మరో విశేషం.

ఇతరులకు నచ్చక పోయినా, లక్ష్య సాధన కోసం సొంతంగా వేసుకున్న మార్గంలో అడుగులేయాలంటూ ప్రబోధిస్తుందీ గీతం.Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

వీటితో పిల్లలకు పాలివ్వడం ఎంతో సులువు!

పసి పిల్లలకు ఆరు నెలలు అంతకుమించి ఏడాది వరకు తల్లిపాలు పట్టడం తప్పనిసరి అంటూ నిపుణులు చెప్పడం మనకు తెలిసిందే. అయితే ఇటు కుటుంబంతో పాటు అటు వృత్తి ఉద్యోగాలకూ సమప్రాధాన్యమిచ్చే అమ్మలున్న ఈ రోజుల్లో ఏడాది వరకు బిడ్డకు తానే నేరుగా పాలివ్వడం అంటే అది కాస్త కష్టమనే చెప్పుకోవాలి. అలాగని బిడ్డలను అలా వదిలేసి తల్లులూ తమ వృత్తిపై దృష్టి పెట్టలేరు. అందుకే అటు నేటి తల్లుల బ్రెస్ట్‌ఫీడింగ్ పనిని సులభతరం చేస్తూ, ఇటు పిల్లలకు తల్లిపాలు అందుబాటులో ఉండేలా చేసేందుకు వివిధ రకాల బ్రెస్ట్‌ఫీడింగ్ గ్యాడ్జెట్లు ప్రస్తుతం మార్కెట్లోకొచ్చేశాయి.

తరువాయి