Published : 22/07/2021 01:39 IST

నెలసరి నొప్పికి ఉపశమనంగా...

రాధికకు నెలసరి అంటేనే భయం. ఆ సమయంలో నొప్పిని తట్టుకోలేదు. ఆహారంలో చేసుకునే మార్పులతో ఈ నొప్పి నుంచి ఉపశమనాన్ని పొందవచ్చని ఆహార నిపుణులు సూచిస్తున్నారు.

* వారం ముందుగా... నెలసరి వచ్చే వారం ముందు రోజు రాత్రి అరకప్పు నీటిలో అయిదారు ఎండు ద్రాక్షలను నానబెట్టాలి. ఉదయం వాటిని నీటిలో మెత్తగా చేసి, రెండు కుంకుమ పూరేకలను కలిపి పరగడుపునే తీసుకుంటే మంచిది.

* మొలకలతో... సెనగలు లేదా పెసలను మొలకలు చేసి ఉంచుకోవాలి. నెలసరి వారానికి ముందుగానే వీటిని సిద్ధం చేసుకోవాలి. అల్పాహారం లేదా మధ్యాహ్నపు భోజనంలో ఆవిరిపై ఉడికించిన మొలకలను కలుపుకొని తీసుకోవాలి. ఇలా వారం ముందు నుంచి చేస్తే, నెలసరి నొప్పి నుంచి ఉపశమనం పొందొచ్చు. 

* దుంపలు... వారానికి రెండుసార్లు చిలకడదుంపను ఉడకబెట్టి తినాలి. రోజూ పావుగంట వ్యాయామం తప్పనిసరి. కాల్షియం లభించే వెన్న, పెరుగు, పాలు, ఆకుపచ్చని కూరగాయలు, సోయాబీన్స్‌ వంటివి వీలైనంతగా తీసుకోవాలి. మూడు పూటలా చెంచా నెయ్యి తీసుకుంటే నెలసరి నొప్పికి దూరంగా ఉండొచ్చు. జీడిపప్పు, వేరుశనగ వంటివి బెల్లంతో కలిపి తీసుకుంటే ఆ సమయంలో మూడ్‌స్వింగ్స్‌ తగ్గుతాయి.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

వీటితో పిల్లలకు పాలివ్వడం ఎంతో సులువు!

పసి పిల్లలకు ఆరు నెలలు అంతకుమించి ఏడాది వరకు తల్లిపాలు పట్టడం తప్పనిసరి అంటూ నిపుణులు చెప్పడం మనకు తెలిసిందే. అయితే ఇటు కుటుంబంతో పాటు అటు వృత్తి ఉద్యోగాలకూ సమప్రాధాన్యమిచ్చే అమ్మలున్న ఈ రోజుల్లో ఏడాది వరకు బిడ్డకు తానే నేరుగా పాలివ్వడం అంటే అది కాస్త కష్టమనే చెప్పుకోవాలి. అలాగని బిడ్డలను అలా వదిలేసి తల్లులూ తమ వృత్తిపై దృష్టి పెట్టలేరు. అందుకే అటు నేటి తల్లుల బ్రెస్ట్‌ఫీడింగ్ పనిని సులభతరం చేస్తూ, ఇటు పిల్లలకు తల్లిపాలు అందుబాటులో ఉండేలా చేసేందుకు వివిధ రకాల బ్రెస్ట్‌ఫీడింగ్ గ్యాడ్జెట్లు ప్రస్తుతం మార్కెట్లోకొచ్చేశాయి.

తరువాయి

సైజ్‌ జీరో కాదు.. ఆరోగ్యం ముఖ్యం!

‘మనసులో కలిగే ఆలోచనల్నే శరీరం ప్రతిబింబిస్తుంది..’ అంటోంది ఫిట్‌నెస్‌ ఫ్రీక్‌ అంకితా కొన్వర్‌. సైజ్‌ జీరో గురించి ఆలోచిస్తూ బాధపడితే మరింత బరువు పెరుగుతామని, అదే ఆరోగ్యంపై దృష్టి పెడితే శరీరం, మనసు రెండూ మన అధీనంలో ఉంటాయని చెబుతోంది. ఆరోగ్యం, ఫిట్‌నెస్‌పై ఎక్కువ శ్రద్ధ పెడుతూ.. ఆ చిట్కాల్ని సోషల్‌ మీడియాలో పంచుకుంటూ అందరిలో స్ఫూర్తి నింపే ఈ మిసెస్‌ సోమన్‌.. తాజాగా బాడీ పాజిటివిటీ గురించి ఇన్‌స్టాలో మరో స్ఫూర్తిదాయక పోస్ట్‌ పెట్టింది. సైజ్‌ జీరో కంటే ఆరోగ్యమే ముఖ్యమంటూ ఆమె షేర్‌ చేసిన పోస్ట్‌ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

తరువాయి