వయసుకు తగ్గ వ్యాయామం
అన్విత 20 ఏళ్ల కూతురితో సమానంగా వ్యాయామాలు చేసేది. కానీ ఈమధ్య నడకతోపాటు చిన్నచిన్న ఎక్సర్సైజులు తప్ప జిమ్‌లో మిగతావి చేయలేకపోతోంది. ఈ పరిస్థితి సహజమే అంటున్నారు ఆరోగ్యనిపుణులు.
అన్విత 20 ఏళ్ల కూతురితో సమానంగా వ్యాయామాలు చేసేది. కానీ ఈమధ్య నడకతోపాటు చిన్నచిన్న ఎక్సర్సైజులు తప్ప జిమ్‌లో మిగతావి చేయలేకపోతోంది. ఈ పరిస్థితి సహజమే అంటున్నారు ఆరోగ్యనిపుణులు. వయసుకు తగ్గట్లుగా శరీరం స్ట్రెచ్ అవుతుందని చెబుతున్నారు. పెద్ద వయసులోనూ యువతలా వ్యాయామం చేయడం వారి ఆరోగ్యంపై ఆధారపడి ఉంటుందంటూ సూచిస్తున్నారు. సాధారణంగా వయసుకు తగినట్లుగా శరీరాన్ని వంచగలిగితే చాలు. ఎక్కువరోజులు ఆరోగ్యంగా ఉండొచ్చు అని సలహా ఇస్తున్నారు.
* వర్కవుట్స్... ఏ వయసు వారైనా వర్కవుట్స్‌ను ఎంచుకోవచ్చు. 50పైబడిన వారు తేలికైన వాటిని ఎంచుకోవాలి. ప్రతి రోజూ నియమిత సమయాన్ని కేటాయించుకుని చేసే వ్యాయామాలకు శరీరం స్పందిస్తుంది. ఇది ఫిట్నెస్ను పెంచడమే కాకుండా, అనారోగ్యాలను దరికి చేరకుండా చేస్తుంది. కొత్తగా వర్కవుట్స్‌ను ప్రారంభించిన వారు మొదట తక్కువ సమయం నుంచి మొదలుపెట్టి, క్రమేపీ పెంచుకుంటూ వెళ్లాలి. లేదంటే ఒకేసారి కండరాలన్నీ తీవ్ర ఒత్తిడికి గురై మరుసటి రోజుకి శరీరం మొరాయిస్తుంది. ప్రతిరోజు అరగంట సేపు చేసే యోగా శరీరాన్నీ, మనసునూ ఆరోగ్యంగా ఉంచుతుంది.
* ఆరుబయట... 20 నుంచి 30 ఏళ్లలోపు మహిళలు ఆరుబయట వాలీబాల్, ఫుట్‌బాల్, టెన్నిస్ వంటివి ఎంచుకోవాలి. ఇవి శరీరమంతటికీ వ్యాయామాన్ని అందిస్తాయి. ప్రతి కండరంలో రక్తప్రసరణ బాగా జరిగి, బలోపేతమవుతాయి. అలాగే పరుగు, ఈత, సైక్లింగ్, వేగంగా నడవడం, తాడాట వంటివన్నీ ఈ వయసు వారికి సరైనవి. వారంలో కనీసం ఆరు రోజులు వ్యాయామం చేయగలిగితే చాలు. వీటితోపాటు నృత్యం, మార్షల్ఆర్ట్స్ వంటివి ఫిట్‌గా ఉంచుతాయి. బరువులెత్తడం కూడా మంచి ఎంపిక.
* ట్రెక్కింగ్... సైక్లింగ్, మారథాన్‌తోపాటు ట్రెక్కింగ్ కండరాలను బలోపేతం చేస్తాయి. 40 ఏళ్లలోపు వారికి సరిపోయే వ్యాయామాలివి. హృద్రోగాలకు దూరంగా ఉంచుతాయి. వర్కవుట్స్‌తోపాటు ఖాళీ సమయాల్లో వీటిని ఎంచుకుంటే మంచిది. 50 ఏళ్లకు కండరాలు, ఎముకల్లో శక్తి కొంచెం తగ్గుతూ ఉంటుంది. మెనోపాజ్ కారణంగా ఎముకల సాంద్రత కూడా తగ్గుముఖం పట్టడం మొదలవుతుంది. అందుకే తుంటి భాగంతోపాటు ఎముకలను బలోపేతం చేసే వ్యాయామాలను ఎంచుకోవాలి. వారంలో అయిదురోజులు అరగంటసేపు నడవాలి. ఒకేచోట ఎక్కువ సమయం కూర్చోకుండా అప్పుడప్పుడు నాలుగు అడుగులు వేయడం, శరీరానికి సరిపడే నీటిని తీసుకోవడం వంటి జాగ్రత్తలు 60లో పడినా ఆరోగ్యంగానే ఉంచుతాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
బ్యూటీ & ఫ్యాషన్
- హెయిర్ బన్.. స్టైలిష్‌గా వేసేద్దాం!
- సన్‌స్క్రీన్... పౌడర్‌లో!
- వేసవిలో వీటి విషయంలో జాగ్రత్త!
- వ్యాయామం వల్ల మొటిమలు రాకుండా..!
- గడువు దాటితే వద్దు...
ఆరోగ్యమస్తు
- రాగుల్లో దాగున్న ‘ఆరోగ్యం’!
- వేరుశనక్కాయలు తింటే... ధ్యానం చేసినట్లే!
- తేలిగ్గా తీసుకోవద్దు!
- ప్రసవానంతరం పొట్టను ఇలా తగ్గించుకుందాం!
- వ్యాయామం చేయలేకపోతున్నారా?
అనుబంధం
- పోనీ ఇలా చెప్పి చూద్దామా?
- పెళ్లికి ముందు సరేనన్నాడు.. ఇప్పుడు వద్దంటున్నాడు!
- నో చెప్పండిలా!
- అనుమానిస్తున్నాడని నిరూపించేదెలా?
- పిల్లలకీ కావాలో రొటీన్!
యూత్ కార్నర్
- Miss Universe : ఈ ముద్దుగుమ్మదే.. ఆ ఘనత!
- ఆ చక్రాలని నడిపించేది వాళ్లే!
- దాచగలరు..!
- మన గచ్చకాయలాట... కొరియాలో!
- విరాళాలకు వారధిగా.. ఆమె సేవలు!
'స్వీట్' హోం
- వేసవిలో.. ఇల్లు చల్లగా!
- గోవర్ధనాల గుబాళింపు!
- ఇనుప కడాయిలో ఇవొద్దు!
- Green Vegetables : వీటిని ఎలా వండుతున్నారు?
- వాచీ రింగు పూల హంగు!
వర్క్ & లైఫ్
- ఒక్క రోజులోనే.. ఒంటరిగా.. ఆ ప్రాంతాలన్నీ చుట్టేశా!
- ఆ అల్లరి పిల్లే ఇప్పుడు టీచరైంది.. ఈ స్టూడెంట్-టీచర్ కథ చదివారా?!
- ప్రయాణాలకు... చిన్ని సాయాలు!
- ఆర్థికంగా ఎదగాలంటే...
- ఇది మహిళల హోలీ.. మగాళ్లకు నో ఎంట్రీ!