బోధనలో మనమే ఎక్కువ!

దేశ భావితరాలను తీర్చిదిద్దడంలో మనదే ప్రధాన పాత్ర తెలుసా... ఎలా అంటారా?

Published : 27 Jul 2021 01:43 IST

దేశ భావితరాలను తీర్చిదిద్దడంలో మనదే ప్రధాన పాత్ర తెలుసా... ఎలా అంటారా?

దేవ్యాప్తంగా ఉపాధ్యాయుల్లో మగ వారికన్నా మహిళలే ఎక్కువ అని ఓ నివేదిక తేల్చింది. పాఠశాల విద్య గురించి జరుగుతున్న అధ్యయనంలో ఈ అంశం వెలుగు చూసింది. 2012-13లో మహిళా ఉపాధ్యాయులు 35.8 లక్షలు ఉండగా, మగవారు 42.4 లక్షలు. 2019 - 20 కొచ్చేసరికి ఉపాధ్యాయినుల సంఖ్య 49.2 లక్షలకి పెరగ్గా, పురుషులు 47.7 లక్షలు. ఈ నివేదిక ప్రకారం... పూర్వ ప్రాథమిక స్థాయి విద్యార్థులకు పాఠాలు చెప్పడంలో మహిళలే ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. ఇందులో లక్షమంది ఉపాధ్యాయినులుంటే, 27 వేల మంది మాత్రమే మగవారు. దేశవ్యాప్తంగా ప్రాథమిక స్థాయిలో బోధన చేస్తున్న వారిలో 19.6 లక్షలమంది మహిళలుండగా, మగవారు 15.7 లక్షలు. కేరళ, దిల్లీ, మేఘాలయ, పంజాబ్‌, తమిళనాడు రాష్ట్రాల్లో హయ్యర్‌గ్రేడ్‌ విద్యార్థులకు బోధించేవారిలోనూ మహిళలే ఎక్కువగా ఉన్నారు. పాఠశాల విద్యారంగాన్ని చూస్తే... 15 లక్షల పాఠశాలలు, 26.5 కోట్ల మంది విద్యార్థులతో మన దేశం ప్రపంచంలోనే అతిపెద్ద వ్యవస్థగా నిలిచింది. 2019 - 20 విద్యా సంవత్సరంలో 13.01 కోట్ల మంది బాలురు, 12.08 కోట్ల మంది బాలికలు ఉన్నత పాఠశాలకు వెళ్లారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్