Published : 28/07/2021 02:18 IST

స్నేహితులను పలకరిస్తే...

ఇంటిపని, ఆఫీస్‌పనితో రోజంతా బిజీబిజీగా గడిపే సరళను అకస్మాత్తుగా నిరాశ, నిస్పృహ ఆవరిస్తాయి. ఏ పనీ చేయాలనిపించదు. ఎందుకీ పరుగు అనే ఆలోచనలు మొదలవుతాయి. శరీరానికి, మెదడుకు విశ్రాంతిలేక తీవ్ర అలసటకు గురైనప్పుడు ఇలా జరుగుతుందంటున్నారు మానసిక నిపుణులు. జాగ్రత్తలు తీసుకోకపోతే అది మరిన్ని దుష్పరిణామాలకు దారి తీస్తుందని హెచ్చరిస్తున్నారు. దాన్నుంచి ఎలా బయటపడాలో సూచిస్తున్నారు..

* సమయాన్ని కేటాయించుకోవాలి.. నిత్యం కొంత సమయాన్ని మీ కోసం కేటాయించుకోవాలి. ఇంటి పని, ఉద్యోగానికే టైం సరిపోవడం లేదు, ఇంకెక్కడ అని అనుకోకుండా, ప్రయత్నించి సాధించాలి. అది గంటైనా చాలు. ఆ సమయంలో మనసుకు నచ్చిన పని చేయాలి. తోట పని, ఇష్టమైన పుస్తకాన్ని చదవడం, నచ్చింది వండుకోవడం... ఇలా ఏదైనా ఆ కాసేపూ మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి.

* స్నేహితులతో... చిన్ననాటి స్నేహితులను పలకరించాలి. ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రాంల ద్వారా పాత స్నేహితులను ఇట్టే గుర్తించొచ్చు. వారి బాగోగులు తెలుసుకోవడం, జ్ఞాపకాలను నెమరు వేసుకోవడం వంటివి ఆహ్లాదపరుస్తాయి. ఒత్తిడిని తగ్గిస్తాయి. వీలైతే స్నేహితులంతా వీడియో కాల్‌లోనైనా కబుర్లు చెప్పుకొంటే అదీ చాలా ఆనందాన్నిస్తుంది.

* పిల్లలతో... చిన్నారులతో గడిపే సమయం ఒత్తిడి నుంచి దూరం చేస్తుంది. రోజూ మీరు చెప్పిన మాటను వారు వింటారు. అయితే వారానికి ఒక రోజు మాత్రం వారు చెప్పినట్లుగా మీరు ఉండటానికి ప్రయత్నించాలి. వారికిష్టమైనవి వండటం, వాళ్లు చెప్పే కథలు వినడం వంటివి పిల్లల్లో ఉత్సాహాన్ని నింపుతాయి. కొత్త గేమ్స్‌ను రూపొందించి ఆడుకుంటే మీకూ కొత్తగా ఉంటుంది. మీ చిన్ననాటి కబుర్లను వారితో పంచుకోవాలి. అలా సరదాగా గడిపే ఆ కొంచెం సమయం కూడా వారమంతా కలిగిన ఒత్తిడిని మటుమాయం చేస్తుంది.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

వీటితో పిల్లలకు పాలివ్వడం ఎంతో సులువు!

పసి పిల్లలకు ఆరు నెలలు అంతకుమించి ఏడాది వరకు తల్లిపాలు పట్టడం తప్పనిసరి అంటూ నిపుణులు చెప్పడం మనకు తెలిసిందే. అయితే ఇటు కుటుంబంతో పాటు అటు వృత్తి ఉద్యోగాలకూ సమప్రాధాన్యమిచ్చే అమ్మలున్న ఈ రోజుల్లో ఏడాది వరకు బిడ్డకు తానే నేరుగా పాలివ్వడం అంటే అది కాస్త కష్టమనే చెప్పుకోవాలి. అలాగని బిడ్డలను అలా వదిలేసి తల్లులూ తమ వృత్తిపై దృష్టి పెట్టలేరు. అందుకే అటు నేటి తల్లుల బ్రెస్ట్‌ఫీడింగ్ పనిని సులభతరం చేస్తూ, ఇటు పిల్లలకు తల్లిపాలు అందుబాటులో ఉండేలా చేసేందుకు వివిధ రకాల బ్రెస్ట్‌ఫీడింగ్ గ్యాడ్జెట్లు ప్రస్తుతం మార్కెట్లోకొచ్చేశాయి.

తరువాయి

సైజ్‌ జీరో కాదు.. ఆరోగ్యం ముఖ్యం!

‘మనసులో కలిగే ఆలోచనల్నే శరీరం ప్రతిబింబిస్తుంది..’ అంటోంది ఫిట్‌నెస్‌ ఫ్రీక్‌ అంకితా కొన్వర్‌. సైజ్‌ జీరో గురించి ఆలోచిస్తూ బాధపడితే మరింత బరువు పెరుగుతామని, అదే ఆరోగ్యంపై దృష్టి పెడితే శరీరం, మనసు రెండూ మన అధీనంలో ఉంటాయని చెబుతోంది. ఆరోగ్యం, ఫిట్‌నెస్‌పై ఎక్కువ శ్రద్ధ పెడుతూ.. ఆ చిట్కాల్ని సోషల్‌ మీడియాలో పంచుకుంటూ అందరిలో స్ఫూర్తి నింపే ఈ మిసెస్‌ సోమన్‌.. తాజాగా బాడీ పాజిటివిటీ గురించి ఇన్‌స్టాలో మరో స్ఫూర్తిదాయక పోస్ట్‌ పెట్టింది. సైజ్‌ జీరో కంటే ఆరోగ్యమే ముఖ్యమంటూ ఆమె షేర్‌ చేసిన పోస్ట్‌ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

తరువాయి