Published : 29/07/2021 01:34 IST

కెరీర్‌ను మార్చుకోవాలంటే...

ఓ ప్రైవేటు సంస్థలో కొన్నాళ్లు పనిచేసిన రమణికి బాబు పుట్టడంతో రాజీనామా చేసింది. ఇప్పుడు వాడికి అయిదేళ్లు నిండటంతో మళ్లీ ఉద్యోగానికి వెళ్లాలనుకుంటోంది. ఇటువంటి వారికి కొన్ని సలహాలు అందిస్తున్నారు కెరీర్‌ నిపుణులు.
* అవగాహన.. గతంలో చేసిన సంస్థలో మార్పులు జరిగి ఉంటాయి. తిరిగి అదే తరహా ఉద్యోగాన్ని చేయాలనుకుంటే దానికి సంబంధించిన సమాచారాన్ని తెలుసుకోవాలి. ఆ విభాగాల్లో అభివృద్ధి, నూతన సాంకేతికతపై అవగాహన పెంచుకోవాలి. అవసరమైతే ఆన్‌లైన్‌ కోర్సులు చేయాలి. దరఖాస్తు చేసుకున్నప్పుడు కావాల్సిన అర్హతలను ముందుగానే సాధించి ఉంటే మంచిది.
* అనుభవం.. అవసరమైతే కెరీర్‌ మార్పుకి సిద్ధంగా ఉండాలి. కొత్త రంగంపై అవగాహన లేదని వెనుకడుగు వేయకూడదు. పూర్వపు అనుభవాన్ని ఉపయోగించుకుంటూ కొత్త విషయాలను అధ్యయనం చేయాలి. అయితే ఎంచుకున్న దాంట్లో మనసుకు నచ్చింది ఉంటేనే విజయాన్ని సాధించగలం. అందుకే పెద్దగా లేని రంగాలను ఎంపిక చేసుకోవద్దు.
* సొంతంగా... సొంత వ్యాపారం అంటే మాత్రం తెలిసిన, కొంతైనా నైపుణ్యం ఉన్న రంగంలోకి అడుగు పెట్టాలి. అవసరమైతే ఆ రంగంలోని నిపుణులను, అనుభవం ఉన్నవారిని సంప్రదించి అడుగేస్తే మరింత మంచిది.
* ఇంట్లోనే ఉంటూ..  పిల్లల సంరక్షణ చూస్తూనే ఏదైనా చేయాలనుకుంటే అందుకూ మార్గాలున్నాయి. సోషల్‌ మీడియా వేదికగా ఎందరో విజయాలను సాధిస్తున్న వారిని స్ఫూర్తిగా తీసుకోవచ్చు. వంట, మిద్దెతోట, చిత్రకళ వంటివేదైనా కావొచ్చు. తెలిసినదాన్ని నలుగురికీ చెప్పడానికి ప్రయత్నిస్తే అదే కెరీర్‌గా మారుతుంది. మనకీ తృప్తిగా ఉంటుంది.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

వీటితో పిల్లలకు పాలివ్వడం ఎంతో సులువు!

పసి పిల్లలకు ఆరు నెలలు అంతకుమించి ఏడాది వరకు తల్లిపాలు పట్టడం తప్పనిసరి అంటూ నిపుణులు చెప్పడం మనకు తెలిసిందే. అయితే ఇటు కుటుంబంతో పాటు అటు వృత్తి ఉద్యోగాలకూ సమప్రాధాన్యమిచ్చే అమ్మలున్న ఈ రోజుల్లో ఏడాది వరకు బిడ్డకు తానే నేరుగా పాలివ్వడం అంటే అది కాస్త కష్టమనే చెప్పుకోవాలి. అలాగని బిడ్డలను అలా వదిలేసి తల్లులూ తమ వృత్తిపై దృష్టి పెట్టలేరు. అందుకే అటు నేటి తల్లుల బ్రెస్ట్‌ఫీడింగ్ పనిని సులభతరం చేస్తూ, ఇటు పిల్లలకు తల్లిపాలు అందుబాటులో ఉండేలా చేసేందుకు వివిధ రకాల బ్రెస్ట్‌ఫీడింగ్ గ్యాడ్జెట్లు ప్రస్తుతం మార్కెట్లోకొచ్చేశాయి.

తరువాయి