చేరేముందే చూసుకోవాలి!

చదువు పూర్తవగానే ఎక్కువ మంది అమ్మాయిలు త్వరగా ఉద్యోగ జీవితంలోకి చేరిపోతుంటారు. అవకాశాన్ని అందుకోవాలనుకోవడం, త్వరగా స్థిరపడాలనుకోవడం ఇందుకు కారణాలు. మంచిదే కానీ.. భవిష్యత్‌ బాగుండాలంటే కొన్ని అంశాలనూ తప్పక పరిశీలించు కోవాలి.

Updated : 31 Jul 2021 05:16 IST

చదువు పూర్తవగానే ఎక్కువ మంది అమ్మాయిలు త్వరగా ఉద్యోగ జీవితంలోకి చేరిపోతుంటారు. అవకాశాన్ని అందుకోవాలనుకోవడం, త్వరగా స్థిరపడాలనుకోవడం ఇందుకు కారణాలు. మంచిదే కానీ.. భవిష్యత్‌ బాగుండాలంటే కొన్ని అంశాలనూ తప్పక పరిశీలించు కోవాలి.
అభివృద్ధి: పెద్ద సంస్థ, మంచి జీతం.. ఎక్కువగా చూసే అంశాలు. మంచిదే కానీ.. వ్యక్తిగతంగా ఎదిగే అవకాశాలున్నాయో లేదో కూడా చెక్‌ చేసుకోవాలి. పదోన్నతులు, స్వయంగా/ సంస్థాపరంగా నేర్చుకునే వీలు కల్పించడం మొదలైనవన్నీ చూసుకోవాలి. ప్రారంభం బాగుంటే సరిపోదు. ముందుకు సాగే అవకాశమూ ఉండాలి.
కొనసాగుతుందా?: ఇప్పుడు టెక్నాలజీ ఎంతగా దూసుకొస్తోందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎప్పుడు ఏ సంస్థ/ రంగం మూత పడుతుందో చెప్పలేని పరిస్థితి. కాబట్టి, తట్టుకోగల సంస్థేనో కాదో చెక్‌ చేసుకోండి. ఏమాత్రం అనుమానం ఉన్నా మార్చుకోవడమే మేలు. కావాలనుకుంటే ఎన్నో కోర్సులున్నాయి. వాటిని నేర్చుకుని కొత్తవాటికి ప్రయత్నించొచ్చు.
 ప్రాధాన్యమెలా?: ఎంత కష్టపడి, పోటీపడి చేసినా గుర్తింపు, పదోన్నతుల దగ్గరికొచ్చేసరికి మగవాళ్లకే ప్రాధాన్యమిస్తుంటాయి కొన్ని సంస్థలు. అలాంటి వాటిని ఎంచుకోకపోవడమే మేలు. కాస్త ఆలస్యమైనా పనికి విలువనిచ్చే వాటినే ఎంచుకోవాలి.
గమనిస్తున్నాయా!: ఇప్పుడు చాలావరకూ వర్క్‌ఫ్రం హోం విధానమే! పని గంటల్లోనూ తేడాలొచ్చాయి. ఒక్కరే అయితే సరే. బంధంలో ఉన్నప్పుడు బాధ్యతలూ ఉంటాయి. ఇలాంటి సమయంలో సంస్థలు ఉద్యోగుల సాదకబాధకాలను అర్థం చేసుకుంటున్నాయా లేదా అన్నదీ చూసుకోవాలి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్