నెలసరికి సెలవు..

ఆ మూడు రోజులూ తీవ్ర కడుపునొప్పి, రక్తస్రావం, మూడ్‌ స్వింగ్స్‌ ఇంకా అనేక ఇబ్బందులు సాధారణం. గృహిణులైతే ఏదో ఒక సమయంలో కాస్త విశ్రాంతికి వెసులుబాటు ఉంటుంది. మరి ఉద్యోగినుల సంగతి! ఉండే సెలవలు ...

Published : 03 Aug 2021 01:00 IST

ఆ మూడు రోజులూ తీవ్ర కడుపునొప్పి, రక్తస్రావం, మూడ్‌ స్వింగ్స్‌ ఇంకా అనేక ఇబ్బందులు సాధారణం. గృహిణులైతే ఏదో ఒక సమయంలో కాస్త విశ్రాంతికి వెసులుబాటు ఉంటుంది. మరి ఉద్యోగినుల సంగతి! ఉండే సెలవలు తక్కువ. ప్రతి నెలా మూడు రోజులు దీనికే వాడితే ఎలా అంటారా? అందుకే ‘పీరియడ్‌ లీవ్‌’ను ఇవ్వాలని ఓ మహిళా సంఘం డిమాండ్‌ చేస్తోంది...

త్తరప్రదేశ్‌ మహిళా శిక్షక్‌ సంఘ్‌ నెలసరిలో మహిళల సమస్యలపై గళమెత్తింది. ప్రతి నెలా నెలసరి సెలవులను కేటాయించాలంటూ ఆ సంస్థ అధ్యక్షురాలు సులోచనా మౌర్య ఆధ్వర్యంలో ప్రతినిధి బృందం రాష్ట్ర మహిళా కమిషన్‌ సభ్యురాలు అనామిక చౌదరిని కలిసి ఓ వినతి పత్రాన్ని సమర్పించింది. ఈ సెలవులను ప్రత్యేకంగా పరిగణించాలని, మిగతా వాటితో కలపకూడదని కోరింది. రాష్ట్రంలోని మహిళా ఉద్యోగులందరికీ ఈ సౌకర్యాన్ని కల్పించాలంది. దేశంలో పలు ప్రైవేటు సంస్థలు నెలసరి సెలవులను ఇస్తున్నాయని,యూపీ ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించాలని కోరింది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ దృష్టికి తీసుకెళతానని అనామిక చౌదరి చెప్పింది. ఆ మూడు రోజులూ ఎంత అసౌకర్యంగా ఉన్నా నిలబడి విధులు నిర్వహించే మహిళా ఉపాధ్యాయుల పరిస్థితిని పరిగణనలోకి తీసుకోవాలని, కేంద్ర ప్రభుత్వం  దేశ వ్యాప్తంగా ఈ సెలవులను ఆచరణలోకి తేవడానికి కృషి చేయాలని కోరింది. ప్రభుత్వ పాఠశాలల్లోని మరుగు దొడ్ల అశుభ్రత వల్ల కూడా ఆ సమయంలో ఉపాధ్యాయినులు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని ఈ సంఘం ప్రస్తావించింది. ఈ సెలవుల విషయంలో రాష్ట్ర గవర్నరు ఆనంది బెన్‌ను కూడా కలిసే ప్రయత్నాల్లో సంఘ సభ్యులు ఉన్నారు. ఈ అంశంపై అవగాహన తీసుకొచ్చేందుకు ఆన్‌లైన్‌లో ‘పీరియడ్‌ లీవ్‌ హ్యాష్‌ట్యాగ్‌’ ప్రచారాన్ని ప్రారంభించారు. దేశవ్యాప్తంగా ఈ సౌకర్యం వస్తే కాస్తైనా ఊరట కదూ!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్