దరఖాస్తు జాగ్రత్త!

భావన డిగ్రీ చేసింది. ఉద్యోగాన్ని వెతుక్కొని తన కాళ్లపై తాను నిలబడాలనుకుంటోంది. అయితే ఆన్‌లైన్‌లో ఎన్ని దరఖాస్తులు పంపుతున్నా సమాధానం లేదు. ఒక్కోసారి ఇంటర్వ్యూ వరకూ వెళ్లి విఫలమవుతోంది....

Published : 03 Aug 2021 01:00 IST

భావన డిగ్రీ చేసింది. ఉద్యోగాన్ని వెతుక్కొని తన కాళ్లపై తాను నిలబడాలనుకుంటోంది. అయితే ఆన్‌లైన్‌లో ఎన్ని దరఖాస్తులు పంపుతున్నా సమాధానం లేదు. ఒక్కోసారి ఇంటర్వ్యూ వరకూ వెళ్లి విఫలమవుతోంది.  కారణమేంటో తెలియట్లేదు. ఇలాంటప్పుడు ఏం చేయాలో కొన్ని సూచనలిస్తున్నారు కెరీర్‌ నిపుణులు. అవేంటో చూడండి....

దరఖాస్తులో... కాలేజీలో మీరు చేసిన ఇంటర్న్‌షిప్స్‌ గురించి వివరంగా దరఖాస్తులో పొందుపరచాలి. అందులో మీరు అందుకున్న ప్రశంసలనూ చేర్చాలి. చదువుకునేప్పుడు ఏదైనా పార్ట్‌టైం ఉద్యోగం చేసినట్లైతే ఆ అనుభవాన్నీ రాయడం మర్చిపోకూడదు. వీటితోపాటు తరగతిలో చేసిన ప్రాజెక్టుల గురించి ప్రస్తావించాలి. వాటిలో సాధించిన విజయాలనూ పొందుపరచాలి. ఇవన్నీ వీలైనంత క్లుప్తంగానే ఉండాలి. ఏదైనా వలంటీర్‌గా పనిచేసిన అనుభవం ఉంటే దాన్నీ జతచేయాలి. అభ్యర్థిని పిలిచేటప్పుడు ప్రతి అంశాన్నీ పరిగణనలోకి తీసుకుంటారు. ఇవన్నీ మీకు ఇంటర్వ్యూ పిలుపును అందించవచ్చు.

భాష... దరఖాస్తులో చక్కటి భాషను వాడాలి. పదాల వినియోగం ఆకర్షణీయంగా కనిపించాలి. చదువు, అర్హత చాలవు, అనుభవం ఉండాలి అనుకోనక్కర్లేదు. చేసిన పార్ట్‌టైం ఉద్యోగం చిన్నదైనా అందులోని బాధ్యతల గురించి చెప్పినా, అది మిమ్మల్ని ఎంపిక చేయడానికి ప్లస్‌ కావొచ్చు. అందుకే మీ వివరాల్ని మంచి పదాలతో చెప్పగలగాలి. అలాగే మీకు తెలిసిన భాషలను మాత్రమే దరఖాస్తులో టిక్‌ పెట్టాలి. ఎందుకంటే మీరు ఇంటర్వ్యూకు వెళ్లినప్పుడు తెలియని భాషలో మాట్లాడటానికి ఇబ్బంది ఎదురుకాకూడదు. 

స్నేహితులతో... సహ విద్యార్థులతో ఉద్యోగ వివరాలను చర్చిస్తూ ఉండాలి. ఎవరెవరు ఎక్కడ అప్లై చేస్తున్నారో అవగాహన ఉంటే, అది మీకు ఉపయోగపడొచ్చు. ఇంటర్వ్యూకు ఎంపికైతే, వెళ్లే ముందే ఆ సంస్థను గురించిన పూర్తి వివరాలను అధ్యయనం చేయాలి. ఇంటర్య్వూలో ఉద్యోగాన్నిస్తే సంస్థ కోసం మీరేం చేయగలరో సంక్షిప్తంగా చెప్పాలి. ముఖ్యంగా దరఖాస్తులో రాసిన విషయాలకు భిన్నంగా మాట్లాడితే ప్రతికూల ప్రభావం చూపుతుంది. అందువల్ల దరఖాస్తు చేసేటపుడే జాగ్రత్తగా ఉండాలి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్