Updated : 08/08/2021 05:16 IST

అప్పుడే మీరు విజేత

కరోనా వల్ల చాలామంది ఉద్యోగాలను కోల్పోయారు. వీరిలో అమ్మాయిల సంఖ్య కాస్త ఎక్కువే. వీరే కాదు... అమ్మలయ్యాక విరామం తీసుకుని సెకండ్‌ ఇన్నింగ్స్‌ మొదలెట్టాలనుకునే వారూ... ఇంటర్వ్యూలో ఈ విషయాలు పాటించడం మరిచిపోవద్దు.

ఆర్హత గుర్తించేలా : ఇంటర్వ్యూ సమయంలోనే... మీ ఆహార్యం, నడవడిక, భావవ్యక్తీకరణ... ఎదుటివారికి మంచి అభిప్రాయం కలిగించాలి. అందుకోసం ముందుగా మీరు కొంత సన్నద్ధం అవ్వాలి. ఒక్క ముక్కలో చెప్పాలంటే చక్కటి ‘ఫస్ట్‌ ఇంప్రెషన్‌’ కలిగించాలి.

మీ ముద్ర వేయండి: ఒక్క ఉద్యోగం కోసం వందలాది మంది రావొచ్చు. అంతమందిలో మీ ప్రత్యేకతను గుర్తించే అంశాలు ఏమున్నాయో చెప్పాలి. అంటే.. చదువు, ఉద్యోగం కాకుండా... మీ అభిరుచులు, ఆసక్తులు... ఇతర సామాజిక కార్యక్రమాల్లో మీ చొరవ వంటివన్నీ మీకో బ్రాండ్‌ ఇమేజ్‌ని సృష్టిస్తాయి. అవి మీకు ప్రత్యేక గుర్తింపునీ తెస్తాయి.

నిరాశొద్దు : చాలారోజులుగా ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారిలో తీవ్ర నిరాశ ఉండటం సహజమే. అలాంటివాళ్లు.. ఎప్పటి కప్పుడు తమలోని సానుకూల అంశాలు బేరీజు వేసుకుంటూ ఉండాలి. నైపుణ్యాలకు పదును పెట్టుకోవాలి. అలా ఆత్మవిశ్వాసాన్ని కూడగట్టుకోవాలని చెబుతున్నారు నిపుణులు. 

పోలికలొద్దు : ఓటమి భయం... ఇతరులతో పోలికను గుర్తు తెస్తుంది. ఎదుటివాళ్లు ఏ మాత్రం అర్హులుగా కనిపించినా ‘ఇక మనం ఔటే!’ అనుకుంటారు. దాంతో ఇంటర్వ్యూలో తగిన సామర్థ్యం చూపలేరు. మీరు అలా చేయొద్దు. మీ ప్రత్యేకత మీదే అనుకోండి.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

వీటితో పిల్లలకు పాలివ్వడం ఎంతో సులువు!

పసి పిల్లలకు ఆరు నెలలు అంతకుమించి ఏడాది వరకు తల్లిపాలు పట్టడం తప్పనిసరి అంటూ నిపుణులు చెప్పడం మనకు తెలిసిందే. అయితే ఇటు కుటుంబంతో పాటు అటు వృత్తి ఉద్యోగాలకూ సమప్రాధాన్యమిచ్చే అమ్మలున్న ఈ రోజుల్లో ఏడాది వరకు బిడ్డకు తానే నేరుగా పాలివ్వడం అంటే అది కాస్త కష్టమనే చెప్పుకోవాలి. అలాగని బిడ్డలను అలా వదిలేసి తల్లులూ తమ వృత్తిపై దృష్టి పెట్టలేరు. అందుకే అటు నేటి తల్లుల బ్రెస్ట్‌ఫీడింగ్ పనిని సులభతరం చేస్తూ, ఇటు పిల్లలకు తల్లిపాలు అందుబాటులో ఉండేలా చేసేందుకు వివిధ రకాల బ్రెస్ట్‌ఫీడింగ్ గ్యాడ్జెట్లు ప్రస్తుతం మార్కెట్లోకొచ్చేశాయి.

తరువాయి

సైజ్‌ జీరో కాదు.. ఆరోగ్యం ముఖ్యం!

‘మనసులో కలిగే ఆలోచనల్నే శరీరం ప్రతిబింబిస్తుంది..’ అంటోంది ఫిట్‌నెస్‌ ఫ్రీక్‌ అంకితా కొన్వర్‌. సైజ్‌ జీరో గురించి ఆలోచిస్తూ బాధపడితే మరింత బరువు పెరుగుతామని, అదే ఆరోగ్యంపై దృష్టి పెడితే శరీరం, మనసు రెండూ మన అధీనంలో ఉంటాయని చెబుతోంది. ఆరోగ్యం, ఫిట్‌నెస్‌పై ఎక్కువ శ్రద్ధ పెడుతూ.. ఆ చిట్కాల్ని సోషల్‌ మీడియాలో పంచుకుంటూ అందరిలో స్ఫూర్తి నింపే ఈ మిసెస్‌ సోమన్‌.. తాజాగా బాడీ పాజిటివిటీ గురించి ఇన్‌స్టాలో మరో స్ఫూర్తిదాయక పోస్ట్‌ పెట్టింది. సైజ్‌ జీరో కంటే ఆరోగ్యమే ముఖ్యమంటూ ఆమె షేర్‌ చేసిన పోస్ట్‌ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మ