పనిచేసే చోట ఇవి గుర్తుండాలి...!

వృత్తి, వ్యక్తిగత జీవితానికి మధ్య విభజన రేఖ ఉండాలి. ఇంట్లోలానే ఆఫీసులో ఉంటానంటే కుదరదు. ఇలా చేస్తే మీ ఉద్యోగానికే ఇబ్బంది ఏర్పడవచ్చు. అందుకే కార్యాలయంలో ఏం చేయాలో, చేయకూడదో చూడండి...

Updated : 17 Aug 2021 04:15 IST

వృత్తి, వ్యక్తిగత జీవితానికి మధ్య విభజన రేఖ ఉండాలి. ఇంట్లోలానే ఆఫీసులో ఉంటానంటే కుదరదు. ఇలా చేస్తే మీ ఉద్యోగానికే ఇబ్బంది ఏర్పడవచ్చు. అందుకే కార్యాలయంలో ఏం చేయాలో, చేయకూడదో చూడండి....

వ్యక్తిగత, కుటుంబ సమస్యలు ప్రతి ఒక్కరికీ ఉంటాయి. అలా అని భార్య, కుటుంబ సభ్యులు ఫోన్‌ చేస్తే వారిని కోప్పడుతూనో, అరుస్తూనో పెద్ద పెద్దగా మాట్లాడొద్దు. ఏదైనా ఇబ్బంది ఉంటే బయటకు వెళ్లి మాట్లాడాలి. లేకపోతే మీ వ్యక్తిగత విషయాలని మీరే అందరికీ చెప్పిన వారవుతారు.

ఆలస్యం... లేటుగా వచ్చే ఉద్యోగి మీద పై అధికారులకు, సహోద్యోగులకు  మంచి అభిప్రాయం ఉండదు. పైగా సమయానికి పని కూడా పూర్తి కాదు. అప్పుడు మీరే మాటపడాల్సి వస్తుంది.

ఫిర్యాదులు వద్దు... కొందరు ప్రతి చిన్న విషయానికీ తోటి ఉద్యోగులపై బాస్‌కి ఫిర్యాదు చేస్తుంటారు. నిజంగా ఇబ్బంది ఎదురైనప్పుడు మాత్రమే ఫిర్యాదు వరకు వెళ్లాలే తప్ప ప్రతి చిన్న విషయానికీ కంప్లైట్‌ బాక్స్‌లా మారొద్దు.

సామాజిక మాధ్యమాల్లో... కొందరు ఆఫీసుకు వచ్చినా ఫేస్‌బుక్‌, వాట్సాప్‌ అంటూ కాలం గడిపేస్తుంటారు. మరీ అత్యవసరమైతే తప్ప వాటి జోలికి పోవద్దు. అంతగా చూడాలనిపిస్తే విరామ సమయంలో చూసుకోవాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్