Published : 22/08/2021 00:50 IST

ఇలా కూర్చోవాలి మరి!

ఇందిర నిత్యం వ్యాయామాలు చేస్తుంది. ఆరోగ్యకర ఆహారం తీసుకుంటుంది. ఆఫీస్‌ నుంచి సాయంత్రం ఇంటికొచ్చేసరికి మెడ, నడుం నొప్పితో బాధపడుతుంది. కారణం తెలియడంలేదామెకు. నియమాలెన్నిపాటించినా, కూర్చునే విధానం, నడిచే తీరు కూడా అవయవాలపై ఒత్తిడిని కలిగిస్తాయంటున్నారు వైద్యనిపుణులు. ఈ కారణంగానే పలురకాల సమస్యలకు గురవుతారని.. ఇందుకు కొన్ని పొరపాట్లు చేయకూడదంటున్నారు. అవేంటంటే...

నిలబడేటప్పుడు..

శరీరం నిటారుగా ఉండాలి. చెవులు కిందగా భుజాలుండేలా చూసుకోవాలి. అలాగే భుజాలు హిప్స్‌కు తిన్నగా ఉండేలా జాగ్రత్తపడాలి. దీంతోపాటు హిప్‌ మోకాలు, పాదం వెనుక భాగంపైకి వచ్చేలా ఉంటే శరీరంలోని కండరాలపై ఎటువంటి ఒత్తిడి పడదు. అలాకాకుండా వంకరగా నుంచోవడం, ఎక్కువసేపు ఒకే కాలిపై శరీరం బరువునంతా ఉంచడం వల్ల అక్కడి కండరాలు బలహీనపడతాయి. భుజాలు ముందుకు వంగినట్లుగా కాకుండా తిన్నగా నిల్చోవడం అలవరుచుకోవాలి.

చేతిలో ఫోన్‌తో

ఎక్కడైనా నుంచొని చేతిలో ఫోన్‌ను చూస్తూ ఎక్కువసేపు ఉండటం వల్ల చాలారకాల ఆరోగ్యసమస్యలు వచ్చే అవకాశం ఉంది. తలను వంచి అధికసమయం ఉంటే తల బరువు ప్రభావం మెడ జాయింట్స్‌, లిగ్మెంట్స్‌పై పడి, అక్కడ ఒత్తిడి పెరుగుతుంది. దీంతో మెడ కండరాల పని తీరు తగ్గి,  తీవ్ర అనారోగ్యానికి గురవుతాయి. ఈ తరహా పొరపాట్లు చేయకుండా ఉంటే ఈ సమస్యకు దూరంగా ఉండొచ్చు.  

కూర్చునేటప్పుడు

ఆఫీస్‌లో గంటలతరబడి ఒకేచోట కూర్చుని పనిచేసేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే మెడ, భుజాలు, చేతులు, నడుంవద్ద కండరాలపై ప్రభావం చూపుతుంది. కంటికి తిన్నగా కంప్యూటర్‌ ఉండేలా ఏర్పాటు చేసుకోవాలి. కీబోర్డు మోచేతులకు సమాన ఎత్తులో ఉండటం తప్పనిసరి. ముందుకు వంగి కూర్చోవడం, కంటికి దగ్గరగా కంప్యూటర్‌ స్క్రీన్‌ ఉండటం మంచిది కాదు. సౌకర్యంగా కూర్చుంటూ, మధ్యమధ్యలో విరామం తీసుకుంటే కండరాల సమస్యలకు దూరంగా ఉండొచ్చు.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

వీటితో పిల్లలకు పాలివ్వడం ఎంతో సులువు!

పసి పిల్లలకు ఆరు నెలలు అంతకుమించి ఏడాది వరకు తల్లిపాలు పట్టడం తప్పనిసరి అంటూ నిపుణులు చెప్పడం మనకు తెలిసిందే. అయితే ఇటు కుటుంబంతో పాటు అటు వృత్తి ఉద్యోగాలకూ సమప్రాధాన్యమిచ్చే అమ్మలున్న ఈ రోజుల్లో ఏడాది వరకు బిడ్డకు తానే నేరుగా పాలివ్వడం అంటే అది కాస్త కష్టమనే చెప్పుకోవాలి. అలాగని బిడ్డలను అలా వదిలేసి తల్లులూ తమ వృత్తిపై దృష్టి పెట్టలేరు. అందుకే అటు నేటి తల్లుల బ్రెస్ట్‌ఫీడింగ్ పనిని సులభతరం చేస్తూ, ఇటు పిల్లలకు తల్లిపాలు అందుబాటులో ఉండేలా చేసేందుకు వివిధ రకాల బ్రెస్ట్‌ఫీడింగ్ గ్యాడ్జెట్లు ప్రస్తుతం మార్కెట్లోకొచ్చేశాయి.

తరువాయి

సైజ్‌ జీరో కాదు.. ఆరోగ్యం ముఖ్యం!

‘మనసులో కలిగే ఆలోచనల్నే శరీరం ప్రతిబింబిస్తుంది..’ అంటోంది ఫిట్‌నెస్‌ ఫ్రీక్‌ అంకితా కొన్వర్‌. సైజ్‌ జీరో గురించి ఆలోచిస్తూ బాధపడితే మరింత బరువు పెరుగుతామని, అదే ఆరోగ్యంపై దృష్టి పెడితే శరీరం, మనసు రెండూ మన అధీనంలో ఉంటాయని చెబుతోంది. ఆరోగ్యం, ఫిట్‌నెస్‌పై ఎక్కువ శ్రద్ధ పెడుతూ.. ఆ చిట్కాల్ని సోషల్‌ మీడియాలో పంచుకుంటూ అందరిలో స్ఫూర్తి నింపే ఈ మిసెస్‌ సోమన్‌.. తాజాగా బాడీ పాజిటివిటీ గురించి ఇన్‌స్టాలో మరో స్ఫూర్తిదాయక పోస్ట్‌ పెట్టింది. సైజ్‌ జీరో కంటే ఆరోగ్యమే ముఖ్యమంటూ ఆమె షేర్‌ చేసిన పోస్ట్‌ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

తరువాయి