Updated : 22/08/2021 04:34 IST

హ్యాపీ ఛాలెంజ్‌కు సిద్ధమేనా!

జీవితంలోని ప్రతి క్షణం ఆనందంగా, హాయిగా గడవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. మరి అదెలా సాధ్యమవుతుంది?ఈ చిట్కాలు పాటించి చూడండి.

మీ చిన్నప్పుడు మీకిష్టమైన పాటలను ఇప్పుడు మరోసారి ఆస్వాదించండి. ఒక్కసారి వెనక్కి వెళ్లి ఆ రోజులను గుర్తుచేసుకోండి. రోజూ ధాన్యం చేయండి. దీంతో మనసంతా ప్రశాంతంగా మారుతుంది. మీకు మీరే ప్రత్యేకమైన అతిథిగా అనుకుని ఓ పూల గుచ్ఛాన్ని కానుకగా ఇచ్చుకోండి. ఆ పూలు మీలో తెలియని సంతోషాలను నింపుతాయి. మీకు మీరే పొగుడుకోండి లేదా ఇతరులు చేసిన మంచి పనిని మెచ్చుకోండి.

నచ్చినవి చేయండి..

మీకిష్టమైన సంగీతం పెట్టుకుని పాదం కదపండి. ఒక్కరే రెస్టారెంట్‌కి వెళ్లి నచ్చింది తినేయండి. కళాత్మకంగా ఏదైనా చేయండి. బొమ్మలు గీయడమో, కవితలు రాయడమో ప్రయత్నించి చూడండి. గోరువెచ్చటి నీటితో స్నానం చేయండి. ఇలా చేస్తే మనసు, తనువు రెండూ సేద తీరతాయి. మీకు నచ్చిన వస్తువులను షాపింగ్‌ చేయండి. అమ్మా, నాన్న, తోబుట్టువు... వారికోసం కానుకలను కొని సర్‌ప్రైజ్‌ చేయండి. వారి మోములోని ఆనందం మీ పెదాలపై దరహాసమవుతుంది. నచ్చిన వంటకం చేసి, దాన్ని కుటుంబ సభ్యులకు రుచి చూపించండి. నచ్చిన వారితో కలిసి  రోజూ కాసేపు నడవండి. సంతోషం, ఆనందం రెండూ మీ వెంటే ఉంటాయి. ఆప్త మిత్రులతో కాసేపు ఫోన్‌లో మాట్లాడండి. వీలైతే వెళ్లి కలవండి. తీరిక సమయాల్లో ఇష్టమైన పుస్తకం చదవండి.  కొత్త విషయాలను నేర్చుకోవడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండండి. అలాగే ఏదైనా పనిని కొత్తగా చేయడానికి ప్రయత్నించండి. ఇది మిమ్మల్ని ఎప్పుడూ ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉండేలా చేస్తుంది.

నిరంతరం సంతోషమే!

ఇతరులకు సాయం అందించడంలో ముందుండండి. అది మీకు ఎక్కడలేని ఆనందాన్ని అందిస్తుంది. మానసిక, శారీరక ఆరోగ్యాన్నిచ్చే యోగాను దినచర్యలో భాగం చేసుకోండి. ఉన్నత స్థానాలను అందుకోవడానికి నిరంతరం ప్రయత్నిస్తూ ఉండాలి. గెలిచిన ప్రతిసారి వేడుక చేసుకోండి. ఎన్ని పనులున్నా వ్యాయామాన్ని నిర్లక్ష్యం చేయొద్దు. అలాగే అందమైన సూర్యోదయాలను చూడటం మరవొద్దు.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

వీటితో పిల్లలకు పాలివ్వడం ఎంతో సులువు!

పసి పిల్లలకు ఆరు నెలలు అంతకుమించి ఏడాది వరకు తల్లిపాలు పట్టడం తప్పనిసరి అంటూ నిపుణులు చెప్పడం మనకు తెలిసిందే. అయితే ఇటు కుటుంబంతో పాటు అటు వృత్తి ఉద్యోగాలకూ సమప్రాధాన్యమిచ్చే అమ్మలున్న ఈ రోజుల్లో ఏడాది వరకు బిడ్డకు తానే నేరుగా పాలివ్వడం అంటే అది కాస్త కష్టమనే చెప్పుకోవాలి. అలాగని బిడ్డలను అలా వదిలేసి తల్లులూ తమ వృత్తిపై దృష్టి పెట్టలేరు. అందుకే అటు నేటి తల్లుల బ్రెస్ట్‌ఫీడింగ్ పనిని సులభతరం చేస్తూ, ఇటు పిల్లలకు తల్లిపాలు అందుబాటులో ఉండేలా చేసేందుకు వివిధ రకాల బ్రెస్ట్‌ఫీడింగ్ గ్యాడ్జెట్లు ప్రస్తుతం మార్కెట్లోకొచ్చేశాయి.

తరువాయి